Advertisement

  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన ..పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన ..పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

By: Sankar Mon, 29 June 2020 10:10 AM

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన ..పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన



నేడు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10.30కి చిట్యాలలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కొత్తగా ఏర్పడిన రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

అలాగే రూ. 25 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రూ.15 కోట్లతో నేరేడుచర్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. లంచ్ చేసిన అనంతరం సాయంత్రం 3-4 గంటల మధ్య నల్గొండలో ఎఫ్‌ఎస్‌టీపీ ప్రారంభించి, అభివృద్ధి పనుల్లో పాల్గొననున్నారు. హరితహారంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటనున్నారు.

కాగా హరిత హారంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ..కొంచెం స్థలం ఉన్న అందులో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ..మొక్కలు ఎక్కువగా ఉంటె మన ఆరోగ్యం కూడా అంత బాగుంటుందని కేటీఆర్ తెలిపారు ..

Tags :
|

Advertisement