Advertisement

  • ఇరు రాష్ట్రాల బస్సు సర్వీసులపై ఏపీ అధికారి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు

ఇరు రాష్ట్రాల బస్సు సర్వీసులపై ఏపీ అధికారి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు

By: Sankar Fri, 18 Sept 2020 7:44 PM

ఇరు రాష్ట్రాల బస్సు సర్వీసులపై ఏపీ అధికారి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు


కరోనా మహమ్మారి కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఆగిపోయిన బస్సు సర్వీసులు ఒక కొలిక్కి రావడం లేదు..ఇప్పటికే అనేక సార్లు మీటింగ్ లు జరిగినప్పటికీ ఎటు తేల్చుకోలేకపోయారు..అయితే తాజాగా ఏపీ తెలంగాణా బస్సుల గురించి ఏపీ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం బస్ సర్వీసులను పెంచడానికి ఇష్టపడడం లేదని ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. తెలంగాణా ఏపీని బస్సులు తగ్గించుకోమని సూచిస్తోందని, తెలంగాణ సూచనల మేరకు సర్వీసులను తగ్గించుకోవవడానికి సిద్దంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఏపీ తగ్గించుకునే 1.10 లక్షల కిలోమీటర్ల మేర రవాణను ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. ఏపీ తిప్పే సర్వీసుల కంటే డబుల్ సర్వీసులు తిప్పుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని ఆయన పేర్కొన్నారు.

అయితే బెజవాడ-హైదరాబాద్ రూట్లో మాత్రమే డబుల్ సర్వీసులు తిప్పుతాంటనంటోన్న తెలంగాణ.. మిగిలిన రూట్ల గురించి ప్రస్తావించడం లేదని ఆయన అన్నారు. ఏపీ 72 రూట్లల్లో బస్సులు తిప్పుతుంటే.. తెలంగాణ 27 రూట్లల్లో మాత్రమే బస్సులు నడుపుతోందని ఆయన అన్నారు..దీనిని బట్టి చూస్తే ఇప్పట్లో ఏపీ - తెలంగాణా మధ్య బస్సులు మొదలయ్యే సూచనలు అయితే కనిపించడం లేదు. అయితే ప్రైవేటు బస్ ఆపరేటర్ లు బస్సులు నడుపుతుండడం కొంత మేర ఇబ్బంది లేకుండా చేస్తుందని చెప్పచ్చు


Tags :
|

Advertisement