Advertisement

  • రోడ్లపైనే గుట్టలు గుట్టలుగా కొవిడ్-19 ఆసుపత్రుల చెత్త

రోడ్లపైనే గుట్టలు గుట్టలుగా కొవిడ్-19 ఆసుపత్రుల చెత్త

By: Anji Thu, 27 Aug 2020 4:49 PM

రోడ్లపైనే గుట్టలు గుట్టలుగా కొవిడ్-19 ఆసుపత్రుల చెత్త

తిరుపతి నగరంలో రోడ్లపైనే కొవిడ్ ఆసుపత్రుల చెత్త గుట్టలు గుట్టలుగా ఉండిపోయింది. పీపీఈ కిట్లు, తిన్న ఆహారం పొట్లాలు, ప్లేట్స్, ఇతర ప్లాస్టిక్‌ కవర్లతో పెద్ద స్థాయిలో వ్యర్థాలు, జనరల్‌ వేస్ట్‌, ఇన్‌ఫెక్టెడ్‌ ప్లాస్టిక్స్‌, ఇన్‌ఫెక్టెడ్‌ వేస్ట్‌, గ్లాస్‌వేర్‌, షార్ప్‌గా ఉన్న వస్తువులు ఎక్కడికక్కడ పడిఉన్నాయి. ఐదు రంగులు గల ప్లాస్టిక్‌ కవర్లలో వేరుచేయాల్సిన బాధ్యత కాలుష్య నియంత్రణ మండలిదే అని కార్పొరేషన్ సిబ్బంది పట్టించుకోలేదు.

ఆహార వ్యర్థాలు తమకు సంబంధంలేదని కార్పొరేషన్‌ వాళ్లే చూడాలని పట్టించుకోని కాలుష్యనియంత్రణ మండలి వారు చెబుతున్నార. బయోమెడికల్‌ వేస్ట్‌‌తో పాటు తిని మిగిలిన ఆహారం కూడా కలిసి ఉండటంతో ఎవ్వరూ తీయక గుట్టలు గుట్టలుగా కొవిడ్ చెత్త రోడ్లపైనే ఉండిపోయింది. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఎవరూ పట్టించుకోకుండా ఉండిపోయారు.

తిరుపతి రుయా, ప్రసూతి ఆస్పత్రుల ప్రాంగణాలతో పాటు స్థానికంగా ఉన్న పలు ప్రైవేట్‌ కొవిడ్‌ ఆస్పత్రుల్లోనూ బయో మెడికల్‌ వేస్ట్‌ రోడ్డుపైనే ఉండిపోయింది. దీంతో రోడ్లపై వెళ్లడానికి వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వాధికారులు దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Tags :
|

Advertisement