Advertisement

  • Covid 19...తీవ్ర అస్వస్థత గురైన రోగుల్లో హార్ట్ ఎటాక్...

Covid 19...తీవ్ర అస్వస్థత గురైన రోగుల్లో హార్ట్ ఎటాక్...

By: chandrasekar Fri, 02 Oct 2020 6:03 PM

Covid 19...తీవ్ర అస్వస్థత గురైన రోగుల్లో హార్ట్ ఎటాక్...

తాజా పరిశోధనలో కరోనా వైరస్ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తుల్లో ముఖ్యంగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు గుండెపోటుకు గురికావడం సాధారణమేనని తేలింది. 80ఏళ్లు పైబడినవారిలో ఇలాంటి ముప్పు సహజమేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కరోనా సోకిన వృద్ధుల్లో మరణానికి గల కారణాలు, వారి ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేపట్టిన అమెరికాలోని మిచిగాన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు.. వారిలో గుండెపోటు రావడాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధ్యయన ఫలితాలను బీఎంజే జర్నల్‌లో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా 68 ఆసుపత్రుల్లో తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న 18 ఏళ్లుదాటిన 5,019 కొవిడ్‌-19 రోగులను పరిశీలించారు. వీరిలో 701(14శాతం) మంది ఆసుపత్రిలో చేరిన 14 రోజుల్లోనే గుండెపోటుకు గురైనట్లు పరిశోధకులు గుర్తించారు. వీరిలో 400 (57శాతం) మందిని మాత్రమే సీపీఆర్‌ అందించడం ద్వారా కాపాడగలిగినట్లు నివేదికలో పేర్కొన్నారు.

అయితే, ఇలా గుండె సంబంధ సమస్యలు ఎదుర్కొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న వారు కేవలం స్వల్ప సీపీఆర్‌ ద్వారా ప్రాణాలతో బయటపడుతున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 80ఏళ్లు పైబడిన వారిలోనే ప్రాణాపాయం తలెత్తుతున్నట్లు నిపుణులు తెలియచేశారు. ఇలాంటి వారికి సీపీఆర్‌ చేసినప్పటికీ గుండె ఆగిపోయే పరిస్థితులు ఎక్కువగానే ఉంటున్నట్లు పేర్కొన్నారు. తీవ్ర అస్వస్థతకు గురై సీపీఆర్ చేసిన రోగుల్లో 12 శాతం మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కేవలం 7 శాతం మంది మాత్రమే సాధారణ లేదా స్వల్పంగా బలహీనమైన నాడీ స్థితితో ఉన్నారని తేలింది. 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో మూడు శాతం మందితో పోలిస్తే, 45 ఏళ్లు దాటిన రోగులలో ఐదో వంతు కంటే ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం ఉన్న లేదా కార్డియాక్ అరెస్ట్‌కు గురైన కరోనా బాధితుల గురించి సంక్లిష్ట నిర్ణయం తీసుకోవడంలో రోగులు, కుటుంబసభ్యులు, వైద్యులకు తెలియజేయడానికి మా అధ్యయన వివరాలు సహకరిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement