Advertisement

  • కొవ్యాక్సిన్‌ టీకా మొదటిదశ క్లినికల్‌ ట్రయల్స్‌

కొవ్యాక్సిన్‌ టీకా మొదటిదశ క్లినికల్‌ ట్రయల్స్‌

By: chandrasekar Sat, 18 July 2020 11:46 AM

కొవ్యాక్సిన్‌ టీకా మొదటిదశ క్లినికల్‌ ట్రయల్స్‌


హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ కీలక ముందడుగు వేసింది.కరోనా వైరస్‌కు తాము వ్యాక్సిన్ తయారు చేసినట్లు ఇప్పటికే ప్రకటించిన సంస్థ, తాము తయారు చేసిన కొవ్యాక్సిన్‌ టీకా మొదటిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది.

మొత్తం 375 మందితో దేశంలోని 12 ప్రాంతాల్లో తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఈ నెల 15న ప్రారంభించినట్లు శుక్రవారం సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని 12 ప్రాంతాల్లో చేస్తున్న క్లినికల్ ట్రయల్స్‌లో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రి కూడా ఉండడం విశేషం.

భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)‌, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కొవ్యాక్సిన్ అనే పేరుతో టీకాను తయారు చేసింది. ఇది అందుబాటులోకి వచ్చేందుకు కీలకమైన క్లినికల్ ట్రయల్స్ దశను దాటాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌కు చెందిన బయోసేఫ్టీ లెవెల్‌-3 ల్యాబ్‌లోనే ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. కొవ్యాక్సిన్ మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతించిన సంగతి తెలిసిందే.

Tags :

Advertisement