Advertisement

  • తండ్రి సానుభూతిపరులను అభిమాన సంఘం నుంచి తొలగించిన స్టార్ హీరో విజయ్

తండ్రి సానుభూతిపరులను అభిమాన సంఘం నుంచి తొలగించిన స్టార్ హీరో విజయ్

By: Sankar Thu, 12 Nov 2020 5:29 PM

తండ్రి సానుభూతిపరులను అభిమాన సంఘం నుంచి తొలగించిన స్టార్ హీరో విజయ్

తమిళనాడులో స్టార్ హీరో విజయ్ మరియు అతడి తండ్రి రాజకీయ వ్యవహారం రంజుగా సాగుతోంది. అభిమానులతో సమావేశం తరువాత నటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఎస్ఏ చంద్ర శేఖర్ సానుభూతిపరులను అభిమాన సంఘం నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో 30 జిల్లాలకు చెందిన జిల్లా అధ్యక్షులతో, జిల్లా కార్యకర్తలతో విజయ్ అత్యవసర భేటీ జరిపాడు. మదురై, తిరుచ్చి, తో సహా పలు జిల్లాలో నుతన జిల్లా అధ్యక్షులను , కార్యకర్తలను నియమించినట్లు నటుడు విజయ్ ప్రకటించాడు.

తన తండ్రితో సంబంధాలున్న ప్రతి ఒక్కరిని విజయ్ మక్కళ్ ఇయక్కం నుండి తొలిగించినట్లు విజయ్ ప్రకటించాడు. తన ఫోటోని కానీ..విజయ్ మక్కళ్ ఇయక్కం పేరుని గాని.. సంఘంలో ఉన్న ముఖ్య కార్యకర్తల అనుమతిలేనిదే ఉపయోగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని నటుడు విజయ్ హెచ్చరించారు

Tags :
|

Advertisement