Advertisement

  • అభిమానులు ఎదురుచూస్తున్న విజయ్ మాస్టర్ టీజర్ వచ్చేసింది

అభిమానులు ఎదురుచూస్తున్న విజయ్ మాస్టర్ టీజర్ వచ్చేసింది

By: Sankar Sun, 15 Nov 2020 05:35 AM

అభిమానులు ఎదురుచూస్తున్న విజయ్ మాస్టర్ టీజర్ వచ్చేసింది


తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలో 'మాస్టర్' గా పప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ గా నటించారు. ఇప్పటికే మాస్టర్ నుంచి విజయ్, విజయ్ సేతుపతి తలపడే పోస్టర్స్ వచ్చేశాయ్.ఎక్స్బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఆంటోనీ శాంతను కీలక పాత్రలు పోషించారు.ఇక ఈ సినిమానుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని అభిమానులంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

మాస్టర్ టీజర్ను విడుదల చేయాలనీ గత కొద్దీ రోజులుగా అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా దర్శక నిర్మాతలను కోరుతున్నారు. అయితే..తాజాగా దీపావళి సందర్భంగా "మాస్టర్" టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్‌. టీజర్‌ విడుదలైన కొద్దిసేపటికే విపరీతంగా వ్యూస్‌ పెరిగాయి

Tags :
|
|

Advertisement