Advertisement

  • అవెంజర్స్ మూవీ డైరెక్టర్స్ దర్శకత్వంలో నటించనున్న ధనుష్

అవెంజర్స్ మూవీ డైరెక్టర్స్ దర్శకత్వంలో నటించనున్న ధనుష్

By: Sankar Fri, 18 Dec 2020 8:55 PM

అవెంజర్స్ మూవీ డైరెక్టర్స్ దర్శకత్వంలో నటించనున్న ధనుష్


సౌత్ ఇండియాలో పాపులర్ నటుడు అయిన ధనుష్ తాజాగా ఒక హాలీవుడ్ మూవీ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..హాలీవుడ్‌లో తెరకెక్కుతున్న నెట్‌ఫ్లిక్స్ చిత్రం ‘ది గ్రే మ్యాన్‌’... స్పై థ్రిల్లర్ నేపథ్యంగా వస్తోన్న సినిమాకి ‘ఎవెంజర్స్‌’తో పాపులర్‌ అయిన రస్సో బ్రదర్స్ అంటోని రస్సో, జోయ్‌ రస్సో కలిసి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకి నటులు క్రిస్ ఎవాన్స్, ర్యాన్ గోస్లింగ్, నటి అనా డి అర్మాస్‌తో కలిసి తమిళ నటుడు ధనుష్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే యేడాది జనవరిలో లాస్‌ ఏంజెల్స్ లో చిత్ర షూటింగ్‌ని ప్రారంభించాలని నిర్మాణ సంస్థ యోచిస్తోంది.ప్రముఖ హాలీవుడ్ తారలతో కలిసి ధనుష్ నటించనున్నట్టు నెట్ ఫ్లిక్స్ ట్వీట్ ద్వారా ప్రకటించింది.

అయితే ధనుష్ ఏ పాత్ర పోషిస్తారో, ఆ పాత్ర ఎంత ముఖ్యమో ఇంకా క్లారిటీ లేదు. ‘గ్రే మ్యాన్’ మూవీతో ధనుష్ కు రెండవ అంతర్జాతీయ ప్రాజెక్టు. గతంలో కెన్ స్కాట్ దర్శకత్వం వహించిన ఫకీర్ (2018) మూవీలో ధనుష్ ప్రధాన పాత్రలో నటించాడు.

Tags :

Advertisement