Advertisement

కెప్టెన్ ను మార్చిన రాత మారలేదు..

By: Sankar Fri, 30 Oct 2020 10:33 AM

కెప్టెన్ ను మార్చిన రాత మారలేదు..


ఐపీఎల్ 2020 సీజన్ మధ్యలో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌ను మార్చినప్పటికీ.. ఆ జట్టు ఆట మారలేదు. ముంబైతో మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు దినేశ్ కార్తీక్ కోల్‌కతా కెప్టెన్సీ పగ్గాలు వదులుకోగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. కానీ ఆ తర్వాత కూడా నైట్ రైడర్స్ తీరు మారలేదు..

వాస్తవానికి దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ పగ్గాలు వదులుకునే సమయానికి కోల్‌కతా ప్రదర్శన బాగానే ఉంది. చెన్నై, పంజాబ్‌లపై ఆ జట్టు వరుసగా 10 పరుగులు, 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఏడు మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. కానీ మోర్గాన్ కెప్టెన్సీ చేపట్టాక.. ఆరు మ్యాచ్‌ల్లో గెలిచింది రెండు మ్యాచ్‌లే.

అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లాండ్ జట్టుకు వరల్డ్ కప్ అందించి మేటి కెప్టెన్ గా పేరుపొందిన మోర్గాన్ ఐపీయల్ మాత్రం కెప్టెన్ గా తేలిపోయాడు..క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ వ్యూహాలు, ఫీల్డింగ్ మోహరింపు జట్టుకు పనికొస్తాయి. కానీ మోర్గాన్ వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. సీజన్ మధ్యలో హడావిడిగా కెప్టెన్‌ను మార్చాక.. కోల్‌కతాకు ఒరిగిందేంటనేది అంతుపట్టడం లేదు. ప్రగ్యాన్ ఓజా లాంటి మాజీ క్రికెటర్లు మోర్గాన్ కెప్టెన్సీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement