Advertisement

  • ఛేజింగ్ లో చతికలపడ్డ చెన్నై సూపర్ కింగ్స్ ...కొంపముంచిన మిడిల్ ఆర్డర్ వైఫల్యం

ఛేజింగ్ లో చతికలపడ్డ చెన్నై సూపర్ కింగ్స్ ...కొంపముంచిన మిడిల్ ఆర్డర్ వైఫల్యం

By: Sankar Thu, 08 Oct 2020 06:40 AM

ఛేజింగ్ లో చతికలపడ్డ చెన్నై సూపర్ కింగ్స్ ...కొంపముంచిన మిడిల్ ఆర్డర్ వైఫల్యం


ఈ సీజన్ లో దిగ్గజ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు ఏది కలిసిరావడం లేదు..ఐపీయల్ చరిత్రలోనే న్నాడు లేని విధంగా వరుస ఓటములను చవి చూస్తుంది..ఏ ఒక్క బాట్స్మన్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలకేపావడం అభిమాలను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది..తాజాగా బుధవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై గెలిచింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాహుల్‌ త్రిపాఠి (51 బంతుల్లో 81; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. డ్వేన్‌ బ్రేవోకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. వాట్సన్‌ (40 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. చెన్నై జట్టులో పీయూష్‌ చావ్లా స్థానంలో కరణ్‌ శర్మను తీసుకోగా... కోల్‌కతా మార్పుల్లేకుండా బరిలోకి దిగింది.

రాహుల్‌ త్రిపాఠితో ఆట ప్రారంభించిన శుబ్‌మన్‌ గిల్‌ (11), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ నితీశ్‌ రాణా (9), మోర్గాన్‌ (7), రసెల్‌ (2), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (12) ఇలా స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ చెన్నై బౌలింగ్‌కు బెంబేలెత్తారు. ఒక్కడు మినహా ఇంకెవరూ పట్టుమని 12 బంతులను మించి ఆడలేకపోయారు. మరోవైపు చెన్నై బౌలర్లలో ఒకే ఒక్క బౌలర్‌ (దీపక్‌ చహర్‌) తప్ప బౌలింగ్‌కు దిగిన ప్రతీ ఒక్కరు ప్రత్యర్థిపై ప్రతాపం చూపినవారే! స్యామ్‌ కరన్, శార్దుల్‌ ఠాకూర్, కరణ్‌ శర్మ తలా 2 వికెట్లు తీసి కోల్‌కతాను కట్టడి చేశారు. బ్రేవో అయితే టెయిలెండర్లు కమలేశ్‌(0), శివమ్‌ మావి (0)లను ఖాతానే తెరువనీయలేదు. ఆఖరి ఓవర్లో వాళ్లిద్దరిని ఔట్‌ చేశాడు. వరుణ్‌ చక్రవర్తి రనౌట్‌ కావడంతో బ్రేవో ఇన్నింగ్స్‌ 20వ ఓవర్లో 3 పరుగులే ఇచ్చాడు.

ఛేజింగ్‌ ఆరంభంలోనే డుప్లెసిస్‌ (17; 3 ఫోర్లు) ఔటైనా.. వాట్సన్‌ నిలకడ కొనసాగించడంతో తొలి అర్ధభాగంలో చెన్నై ఇన్నింగ్స్‌ సాఫీగా సాగింది. అబంటి రాయుడు (27 బంతుల్లో 30; 3 ఫోర్లు) తో కలిసి షేన్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఫలితంగా పవర్‌ ప్లే ముగిసేసరికి ధోనీ సేన వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించాక రాయుడు ఔట్‌ కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ (11) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. 41 బంతుల్లో 67 పరుగులు చేయాల్సిన దశలో వాట్సన్‌ ఔటవడంతో చెన్నై చిక్కుల్లో పడింది. బ్యాటింగ్‌లో సత్తా చాటలేకపోయిన రస్సెల్‌ 18వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చి కేవలం 3 పరుగులే ఇచ్చి ధాటిగా ఆడుతున్న సామ్‌ కరన్‌ (17)వికెట్‌ పడగొట్టగా.. తదుపరి ఓవర్‌లో నరైన్‌ 10 పరుగులు ఇచ్చాడు. ఫలితంగా చివరి ఓవర్‌లో 26 పరుగులు చేయాల్సి ఉండగా.. జడేజా (21), జాదవ్‌ (7) 15 పరుగులే చేయగలిగారు.

Tags :
|

Advertisement