Advertisement

  • కోల్‌కతా నైట్‌రైడర్స్ పరువు నిలబెట్టిన పాట్‌ కమిన్స్ మరియు ఇయాన్‌ మోర్గాన్

కోల్‌కతా నైట్‌రైడర్స్ పరువు నిలబెట్టిన పాట్‌ కమిన్స్ మరియు ఇయాన్‌ మోర్గాన్

By: chandrasekar Sat, 17 Oct 2020 10:19 AM

కోల్‌కతా నైట్‌రైడర్స్ పరువు నిలబెట్టిన పాట్‌ కమిన్స్ మరియు ఇయాన్‌ మోర్గాన్


శుక్రవారం జరిగిన ఐపీల్ మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పరువుని పాట్‌ కమిన్స్ మరియు ఇయాన్‌ మోర్గాన్ నిలబెట్టారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. పాట్‌ కమిన్స్‌ (53 నాటౌట్‌ 36 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కమిన్స్‌ మెరుపు అర్ధసెంచరీకి తోడు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (39 నాటౌట్‌ 29 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో కోల్‌కతా పోరాడే స్కోరు సాధించింది. ముంబై నుంచి ఏ బౌలరూ వీరి జోరును అడ్డుకోలేకపోయారు. ముఖ్యంగా కమిన్స్‌ బాదుడుకు స్టేడియం హోరెత్తింది. ఆరో వికెట్‌కు కమిన్స్‌, మోర్గాన్‌ 87(56 బంతుల్లో) పరుగులు జోడించారు. 61/5తో పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టుకు వీరిద్దరూ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి మెరుగైన స్కోరు అందించారు. రాహుల్‌ త్రిపాఠి(7), శుభ్‌మన్‌ గిల్‌(21), నితీశ్‌ రాణా(5), దినేశ్‌ కార్తీక్‌(4) దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్ల ధాటికి టాప్‌ ఆర్డర్‌ పెవిలియన్‌కు క్యూ కట్టింది. తొందరగా వికెట్లు పోగుట్టుకున్నారు.

డాషింగ్ బ్యాట్స్ మాన్ రస్సెల్‌(12) ఎక్కువసేపు నిలువలేదు. కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితమవడంతో ముంబై బౌలర్లు కీలకపాత్ర పోషించారు. రాహుల్‌ చాహర్‌(2/18) కోల్‌కతాను దెబ్బకొట్టాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, నాథన్‌ కౌల్ట్‌నైల్‌, బుమ్రా చెరో వికెట్‌ పడగొట్టారు. 4 ఓవర్లు వేసిన నాథన్‌ 51 పరుగులు సమర్పించుకున్నాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్లో రాహుల్‌ త్రిపాఠి వెనుదిరిగాడు. త్రిపాఠి(7) భారీ షాట్‌ ఆడగా సూర్యకుమార్‌ అద్భుత క్యాచ్‌కు అతడు పెవిలియన్‌ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నితీశ్‌ రాణా(5) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. కౌల్టర్‌ నైల్‌ వేసిన ఆరో ఓవర్లో వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ చేతికి చిక్కాడు. ఎనిమిదో ఓవర్లో రాహుల్‌ చాహర్‌ రెండు వికెట్లు తీసి కోల్‌కతాను భారీ దెబ్బకొట్టాడు. వరుస బంతుల్లో శుభ్‌మన్‌ గిల్(21)‌, దినేశ్‌ కార్తీక్‌(4)లను ఔట్‌ చేశాడు. కోల్‌కతా ప్రధాన బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌ చేరడంతో మ్యాచ్‌పై ముంబై పట్టుసాధించింది. ఆఖర్లో మోర్గాన్‌, కమిన్స్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో కోల్‌కతా స్కోరు 140 దాటింది. ఇందువల్ల కోల్ కతా నైట్‌రైడర్స్ పరువు నిలిచినట్లు అయ్యింది.

Tags :

Advertisement