Advertisement

  • అప్పటిదాకా భారత క్రికెట్ భారాన్ని సచిన్ మోశాడు ..అందుకే ఆ రోజు ఆ దిగ్గజాన్ని మేము ఎత్తుకున్నాము ..కోహ్లీ

అప్పటిదాకా భారత క్రికెట్ భారాన్ని సచిన్ మోశాడు ..అందుకే ఆ రోజు ఆ దిగ్గజాన్ని మేము ఎత్తుకున్నాము ..కోహ్లీ

By: Sankar Wed, 29 July 2020 7:28 PM

అప్పటిదాకా భారత క్రికెట్ భారాన్ని సచిన్ మోశాడు ..అందుకే ఆ రోజు ఆ దిగ్గజాన్ని మేము ఎత్తుకున్నాము ..కోహ్లీ



టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 2011 ప్రపంచ కప్ సమయంలో సచిన్ టెండూల్కర్ ను బుజాల మీద ఎత్తుకొని మోసిన సంఘటనను ఏ భారత అభిమాని అంత త్వరగా మరిచిపోరు..అయితే ఆరోజు ఆలా ఎందుకు చేసామో కోహ్లీ వివరించాడు ..ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ ‌పేరుతో మయాంక్ అగర్వాల్ నిర్వహించిన చాట్‌షోలో పాల్గొన్న కోహ్లీ స‌చిన్ ఎపిక్ మూమెంట్స్‌ను షేర్ చేసుకున్నాడు.

2011 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఎప్ప‌టికి గుర్తుండిపోతుంది. ఆరోజు నాకు కలిగిన సంతోషాన్ని మాట‌ల్లో చెప్ప‌లేక‌పోయా. అందుకే లెజెండ్ స‌చిన్ పాజీని భుజానికెత్తుకున్న ఫొటో ఎప్పుడూ చూసినా సరే గర్వంగా అనిపిస్తుంది. ఆ మ్యాచ్ గెల‌వ‌డంతో మేము వరల్డ్ చాంపియన్స్ అయ్యాము. ఆ సమయంలో తెలియకుండానే జట్టంతా సచిన్ చుట్టూ చేరింది. ఎందుకంటే అది సచిన్‌కు చివరి వరల్డ్‌కప్ అని మా అందరికీ తెలుసు. పాజీ దేశానికి ఎంతో చేశాడు. అలాంటి వ్యక్తికి మేమిచ్చిన గిఫ్ట్ వరల్డ్‌కప్.

అతను భారత క్రికెట్‌ను 21 ఏళ్లుగా మోసాడు. అందుకే ఆ క్షణాన మేం అతన్ని మా భుజాలపై ఎత్తుకున్నాం. తనదైనా ఆటతో దేశంలోని చాలామంది పిల్లలకు స్పూర్తిదాయకంగా నిలిచాడు. వారందరి తరఫున సచిన్‌కు మేం ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. ఎందుకంటే కొన్నేళ్లుగా సచిన్ భారత్‌కు ఎన్నో ఇచ్చాడు. ఇస్తూనే ఉన్నాడు. తన స్వస్థలంలో సచిన్ కల నెరవేరిందని మేమంతా భావించాం. అందుకే గౌరవ సూచకంగా భుజాలపై ఎత్తుకున్నాం.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Tags :
|
|
|

Advertisement