Advertisement

గ్రెగ్ చాపెల్‌ మాటలకూ స్పందించిన కోహ్లి...

By: chandrasekar Thu, 17 Dec 2020 4:44 PM

గ్రెగ్ చాపెల్‌ మాటలకూ స్పందించిన కోహ్లి...


టీమిండియా మాజీ కోచ్‌, ఆస్ట్రేలియా మాజీ ప్లేయ‌ర్ గ్రెగ్ చాపెల్‌కు నోటి దురుసు కాస్త ఎక్కువ‌.

ఈ మ‌ధ్య టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్ర‌శంసిస్తూనే అత‌ని మైండ్‌సెట్ ఓ ఆస్ట్రేలియ‌న్‌లాగా ఉంద‌న్నాడు. గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్న స‌మ‌యంలోనూ ప్ర‌త్యర్థి ప్లేయ‌ర్స్‌ను మాట‌ల‌తో బెద‌ర‌గొట్ట‌డం ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌కు అల‌వాటు. ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు అస‌లు క్రికెట్ అంటే తామే కేరాఫ్ అన్న‌ట్లుగా వాళ్లు వ్య‌వ‌హ‌రిస్తారు. గ్రౌండ్‌లో కోహ్లి దూకుడైన ఆట‌తీరు, పోరాట ప‌టిమ చూస్తుంటే ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ ‌లాగే ఉంద‌ని చెప్పాడు.

కోహ్లి ఈ మాటలకూ స్పందిస్తూ...నా వ్య‌క్తిత్వం, ప‌ర్స‌నాలిటీ ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ని నేను అనుకుంటాను అని కోహ్లి చెప్పాడు. తానెప్పుడూ త‌నలాగే ఉన్నాన‌ని విరాట్ అన్నాడు. ఈ స‌రికొత్త ఇండియా ఎలాంటి స‌వాళ్ల‌నైనా స్వీక‌రించ‌డానికి సిద్ధంగా ఉ౦‌ద‌ని

పెకొన్నాడు. తన మైండ్‌సెట్‌ను ఓ ఆస్ట్రేలియ‌న్ తో పోల్చాల్సిన అవ‌స‌రం లేద‌ని, త‌న వ్య‌క్తిత్వం తొలి రోజు నుంచీ ఇలాగే ఉంద‌ని అన్నాడు.

Tags :
|

Advertisement