Advertisement

  • సచిన్ రికార్డు బద్దలు కొట్టే సత్తా ఆ ఆటగాడికి మాత్రమే ఉంది

సచిన్ రికార్డు బద్దలు కొట్టే సత్తా ఆ ఆటగాడికి మాత్రమే ఉంది

By: Sankar Tue, 25 Aug 2020 08:17 AM

సచిన్ రికార్డు బద్దలు కొట్టే సత్తా ఆ ఆటగాడికి మాత్రమే ఉంది


ప్రపంచ క్రికెట్ లో రికార్డులు అంటే ముందుగా గుర్తొచె ఆటగాడు సచిన్ టెండూల్కర్..ఏ క్రికెట్ కల్లో కూడా ఉహించనివిధంగా 100 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు..ఇక ఆ రికార్డు బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు అనుకుంటూ ఉండగా మరొక క్రికెటర్ సచిన్ రికార్డు లను అధిగమనించేందుకు దూసుకు వచ్చాడు..అతడే ఇండియన్ కెప్టెన్ కింగ్ కోహ్లీ..ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లీ సచిన్ 100 సెంచరీల రికార్డుపై కన్నేశాడు..

విరాట్ కోహ్లీ రికార్డుల గురించి తాజాగా స్టార్‌స్పోర్ట్స్ షోలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ‘‘సచిన్ టెండూల్కర్ తర్వాత 100 సెంచరీల మైలురాయిని అందుకోగల సత్తా ఉన్నా ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. 12 ఏళ్ల ఇంటర్నేషనల్ కెరీర్‌లో ఇప్పటికే కోహ్లీ చాలా సాధించాడు. నా అంచనా ప్రకారం సచిన్ 100 సెంచరీల రికార్డ్‌ని ఎవరైనా బద్ధలు కొట్టగలరంటే..? అది విరాట్ కోహ్లీ మాత్రమే. అతనిలో ఆ సామర్థ్యం, ఫిట్‌నెస్ ఉంది’’ అని వెల్లడించాడు.

అయితే ఇప్పటి వరకూ 43 వన్డే సెంచరీలు, 23 టెస్టు శతకాల రూపంలో మొత్తం 70 ఇంటర్నేషనల్ సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. మరో పదేళ్ల పాటు క్రికెట్ ఆడే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు చెప్తున్నారు. అదే జరిగితే..? సచిన్ శతకాల రికార్డ్ బద్ధలవ్వడమే కాకుండా.. సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Tags :
|
|
|
|

Advertisement