Advertisement

  • కోహ్లీ ఆటతీరు అచ్చం ఆ దిగ్గజమును పోలి ఉంటుంది

కోహ్లీ ఆటతీరు అచ్చం ఆ దిగ్గజమును పోలి ఉంటుంది

By: Sankar Wed, 24 June 2020 3:46 PM

కోహ్లీ ఆటతీరు అచ్చం ఆ దిగ్గజమును పోలి ఉంటుంది



వివియన్ రిచర్డ్స్ ..అరివీరభయంకర వెస్ట్ ఇండీస్ ఆటగాడు ..హెల్మెట్ లేని రోజుల్లో ఏ మాత్రం భయం లేకుండా ఎందరో ఫాస్ట్ బౌలర్లను చీల్చి చెండాడాడు ..అతని తరణంలో రిచర్డ్స్ దరిదాపుల్లోకి వచ్చే ఆటగాడు ఇంకొకడు లేదు అంటే అతిశయోక్తి కాదు ..వన్ డే క్రికెట్లోనే అత్యంత నెమ్మదిగా ఆడే ఆ రోజుల్లో , రిచర్డ్స్ టెస్టుల్లోనే 80 కి పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు చేసేవాడు ..మరోవైపు ఇండియన్ ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే కోవకు చెందిన వాడు ..బౌలర్ ఎవరైనా సరే ఏ మాత్రం బెదరకుండా కోహ్లీ చెలరేగిపోతాడు..కోహ్లీ మైదానం లో ఉండే విధానం చూస్తే ఆచం రిచర్డ్స్ ను చూసినట్లు ఉంటుంది ..

తాజాగా ఇండియన్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఇవే వ్యాఖ్యలు చేసాడు ..భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అచ్చం వివియన్‌ రిచర్డ్స్‌లాగే ఆడుతున్నాడని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ అంటున్నా డు. అందుకే అతను ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని చెప్పాడు. ‘రిచర్డ్స్‌ను కట్టడి చేయడం బౌలర్లకు చాలా కష్టమయ్యేది. ముఖ్యంగా పరిమిత ఓవర్లలో అతడు శివాలెత్తిపోయేవాడు. అచ్చం అతడిలాగే ఇప్పుడు కోహ్లీ కూడా ఆడుతున్నాడు. ఎక్స్‌ట్రా కవర్‌లోనూ.. మిడాన్‌, మిడ్‌ వికెట్‌ మీదుగా బౌండరీలు బాదే శైలి ఇద్దరిదీ ఒకేలా ఉంటుంది. అరుదుగా కనిపించే ఈ ఆటతీరే విరాట్‌ను నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ను చేసింది.

గతంలో గుండప్ప విశ్వనాథ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ శైలి కూడా ఇలాగే ఉండేది’ అని గవాస్కర్‌ పేర్కొన్నాడు. గతేడాది భారత జట్టు కరీబియన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు రిచర్డ్స్‌ను ఇంటర్వ్యూ చేసే అవకాశం కోహ్లీకి దక్కింది. ఆటపై తనకున్న ఆసక్తి, అంకితభావాన్ని ఇప్పుడు కోహ్లీలో చూస్తున్నానని రిచర్డ్స్‌ కొనియాడాడు. గతంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ కూడా వీరిద్దరి ఆట ఒకేలా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రిచర్డ్స్‌, కోహ్లీ మామూలు షాట్లను కూడా అద్భుతంగా ఆడి చూపిస్తారని అప్పట్లో చాపెల్‌ ప్రశంసించాడు.

Tags :
|

Advertisement