Advertisement

  • ఒక్క రోజులో F3వేల కరోనా పరీక్షల్ని చేయగల కోబాస్‌ 8800 యంత్రం

ఒక్క రోజులో F3వేల కరోనా పరీక్షల్ని చేయగల కోబాస్‌ 8800 యంత్రం

By: chandrasekar Sat, 26 Sept 2020 4:46 PM

ఒక్క రోజులో f3వేల కరోనా పరీక్షల్ని చేయగల కోబాస్‌ 8800  యంత్రం


దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా ఒక రోజులోనే 3వేల కరోనా పరీక్షల్ని చేయగల కోబాస్‌ 8800 యంత్రాన్ని నిమ్స్‌లోనే ప్రవేశపెట్టడం విశేషం. కోబా్‌సతో పాటు మూత్రపిండాలు, కాలేయం, గుండె మార్పిడి, బోన్‌మారో మార్పిడికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు చేసేందుకై రూ.6 కోట్ల వ్యయంతో మాలికులర్‌ పరీక్షా కేంద్రాన్ని కూడా ఈటల రాజేందర్ ప్రారంభించారు. ప్రతి 8 గంటలకు 960 నమూనాలను నిర్ధారించే సామార్థ్యం కోబాస్‌ 8800 యంత్రానికి ఉందని మంత్రి వివరించారు. మొదటి 96 ఫలితాలను 3.5 గంటల్లో అందిస్తే, ఆ తరువాత ప్రతి అరగంటకు 96 నమూనాల చొప్పున 8 గంటల్లో 960 ఫలితాలను అందిస్తుందన్నారు. హెచ్‌ఐవి, కరోనా, క్షయ పరీక్షలను ఒకేసారి చేయడానికి ఈ యంత్రంలో వీలుందని, ఆర్‌ఎ్‌ఫఐడి బార్‌ కోడ్‌ నమూనా నుంచి ఫలితం వరకు పూర్తి స్థాయిలో గుర్తించగలవని తెలిపారు.

మాలిక్యులర్‌ ల్యాబ్‌లోఆర్టీపీసీఆర్‌, అత్యాధునిక మైక్రోస్కోప్‌, మిస్టర్‌ స్పాట్‌, ఫ్లోసైటోమెట్రీ, అప్రెసిస్‌, డిఎన్‌ఏ స్వేవిన్సింగ్‌, ఎలిసా రీడర్స్‌ యంత్రాలు, సెల్‌ కల్చర్‌ ల్యాబ్స్‌, మాక్స్‌ కాలమ్స్‌ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ల్యాబ్స్‌ను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన నిధులు సమకూరుస్తామన్నారు. వచ్చే నెలలో మరికొన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. నిమ్స్‌లో పలు విభాగాలు కలిపి రోజుకు పదివేల పరీక్షలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నిమ్స్‌లో ఆగిపోయిన అన్నిరకాల వైద్య సేవలను 15 రోజుల్లో పూర్తి స్థాయిలో తిరిగి అందిస్తామని మంత్రి ఈటల చెప్పారు. ‘‘ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాలు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టేలా కరోనా వైరస్‌ చేసింది. ఎన్ని వేల కోట్లు అయినా సరే ఖర్చు పెట్టి ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందించేలా వైద్య పరికరాలు, మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించాం’’ అని తెలిపారు.

Tags :

Advertisement