Advertisement

  • ఆ ఆటగాడు కచ్చితంగా జట్టులో ఉండాల్సిందే ...కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ కె ఎల్ రాహుల్

ఆ ఆటగాడు కచ్చితంగా జట్టులో ఉండాల్సిందే ...కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ కె ఎల్ రాహుల్

By: Sankar Thu, 22 Oct 2020 09:52 AM

ఆ ఆటగాడు కచ్చితంగా జట్టులో ఉండాల్సిందే ...కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ కె ఎల్ రాహుల్


కొన్ని జట్లు ఒక ఆటగాడు ఎంత విఫలం అవుతున్న కూడా అతడికి అవకాశాలుఇస్తూనే ఉంటాయి..దానికి ఉదాహరణ చెన్నై జట్టులో కేదార్ జాదవ్ అయితే , కింగ్స్ ఎలెవన్ పూజాబ్ జట్టులో మాక్స్వెల్ ..దాదాపు పదికోట్లు పైగా పెట్టి మ్యాక్సీ ని పంజాబ్ కొనుక్కుంది..కాని ఈ ఐపీయల్ లో మ్యాక్సీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఒకటి కూడా చేయలేకపోయాడు..దీనితో అతడిని జట్టు నుంచి తొలగించాలని తీవ్ర విమర్శలు వస్తున్నాయి..అయితే మాక్స్వెల్ ప్రదర్శనపై ఆ జట్టు కెప్టెన్ కె ఎల్ రాహుల్ స్పందించాడు

.'నిజానికి మ్యాక్స్‌వెల్‌ ప్రాక్టీస్‌ సమయంలో బ్యాటింగ్‌ విషయంలో బాగా కష్టపడుతున్నాడు. మ్యాక్సీ మా జట్టులో ఒక అద్భుతమైన టీం మెంబర్‌గా కనిపిస్తాడు. అతను జట్టులో ఉంటే నాకు ఎందుకో మేము మంచి బ్యాలెన్స్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. జట్టులో 11 మంది సరిగ్గా ఆడడం అనేది ఎప్పటికీ జరగదు. ఫీల్డింగ్‌లోనూ అందరూ తమ వైవిధ్యమైన ఆటతీరును చూపలేరు. కానీ మ్యాచ్‌ విన్నర్లు జట్టుకు చాలా అవసరం. ఇది మాక్స్‌వెల్‌లో పుష్కలంగా ఉంది..

అయితే ఈ సీజన్‌లో అతను విఫలం కావడం నిజమే. కానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ చేసిన 32 పరుగులు మా జట్టు విజయంలో మరో కీలకపాత్ర అని చెప్పొచ్చు. నా దృష్టిలో మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌లోకి వచ్చాడనే అనుకుంటున్నా. ఒకవేళ అదే నిజమైతే మాత్రం అతని నుంచి ఇకపై మంచి ఇన్నింగ్స్‌లు చూసే అవకాశం ఉంటుంది.' అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు

మ్యాక్స్‌వెల్‌ కొనసాగించడంపై విమర్శలు వస్తున్న వేళ విండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా మాత్రం మ్యాక్సీకి మద్దతుగా నిలిచాడు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌పై కింగ్స్‌కు నమ్మకం ఉంది. తన ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌తో జట్టుకు విజయం సాధించే అవకాశాలు ఉండడంతోనే జట్టులో అతన్ని ఆడిస్తోందని పేర్కొన్నాడు. ఢిల్లీపై విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకిన పంజాబ్‌ తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్‌ 24న సన్‌రైజర్స్‌తో తలపడనుంది.

Tags :
|

Advertisement