Advertisement

  • సూపర్ ఓవర్ కు ముందు షమీ అన్న మాటలకు మాకు ఆశ్చర్యం వేసింది ..కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ రాహుల్

సూపర్ ఓవర్ కు ముందు షమీ అన్న మాటలకు మాకు ఆశ్చర్యం వేసింది ..కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ రాహుల్

By: Sankar Mon, 19 Oct 2020 12:20 PM

సూపర్ ఓవర్ కు ముందు షమీ అన్న మాటలకు మాకు ఆశ్చర్యం వేసింది ..కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ రాహుల్


నిన్న రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఐపీయల్ చరిత్రలోనే ఒక మరుపురాని మ్యాచ్ గా నిలిచిపోయింది ..టి ట్వంటీ మ్యాచ్ లో ఒక్కసరి టై అయితేనే గ్రేట్ అనుకుంటే , నిన్నటి మ్యాచ్ లో మాత్రం సూపర్ ఓవర్ కూడా టై అయింది..తొలుత ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా సూపర్ ఓవర్లో పంజాబ్ బాట్స్మన్ ను నిలువరించి కేవలం అయిదు పరుగులే ఇచ్చాడు ..దీనితో ముంబై విజయం ఖాయం అని అందరు భావించారు..

కానీ, మహ్మద్‌ షమీ యార్కర్ల దాడితో స్వల్ప లక్ష్యాన్ని ముంబై అందుకోలేకపోయింది. డికాక్‌ (3) వికెట్‌ కోల్పోయి ఐదు పరుగులే చేయడంతో సూపర్‌ ఓవర్‌ కూడా ‘టై’ అయింది. దీంతో ఫీల్డ్‌ అంపైర్లు సమాలోచనలు జరిపి మరో సూపర్‌ ఓవర్‌ను ఆడించారు. ఈసారి తొలుత ముంబై హర్దిక్‌ పాండ్యా (1) వికెట్‌ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్‌... గేల్‌ (7) సిక్స్, మయాంక్‌ (8) 2 ఫోర్లతో ఇంకో రెండు బంతులుండగానే 15 పరుగులు చేసి గెలిచింది.

అద్భుతమైన బౌలింగ్‌తో తొలి సూపర్‌ ఓవర్‌లో ఆరు పరుగుల లక్ష్యాన్ని కాపాడిన మహ్మద్‌ షమీపై పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ప్రశంసలు కురిపించాడు. ముంబై నిర్దేశించిన సూపర్‌ ఓవర్‌ లక్ష్యాన్ని కాపాడుకోవాంటే ఆరు బంతులూ యార్కర్లు వేయాలని షమీ అనుకున్నానని తెలిపాడు. 6 బంతులూ యార్కర్లు వేద్దామనుకుంటున్నాడని షమీ చెప్పడం పట్ల తామంతా ఆశ్చర్యానికి గురయ్యామని పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెస్‌ మీట్‌లో రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

షమీ నిర్ణయాన్ని కెప్టెన్‌గా తాను, మిగతా సీనియర్‌ ఆటగాళ్లు స్వాగతించామని అన్నాడు. తన ప్లాన్‌ని పక్కాగా అమలు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు. ఇక తాజా విజయంతో తమకు రెండు పాయింట్లు జతకావడం పట్ల రాహుల్‌ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా, ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ మూడింట విజయం సాధించింది.

Tags :

Advertisement