Advertisement

  • వార్నర్ గాయంపై జోకులు పేల్చిన టీం ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్

వార్నర్ గాయంపై జోకులు పేల్చిన టీం ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్

By: Sankar Mon, 30 Nov 2020 3:26 PM

వార్నర్ గాయంపై జోకులు పేల్చిన టీం ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్


ఇండియా తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్ డే సిరీస్ లో ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్ లలో విజయాలు సాధించి సిరీస్ గెలుచుకున్న విషయం తెలిసిందే..అయితే ఈ ఆనందంతో పాటు వరుసగా గాయాలతో ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోతుంది..ఇప్పటికే స్టార్ అల్ రౌండర్ స్టయినిస్ గాయంతో దూరం కాగా తాజాగా వార్నర్ కూడా గాయపడ్డాడు..

వార్నర్‌ కోలుకోవడానికి ఎన్ని వారాలు సమయం పడుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా.. లేదా అనేది కూడా అనుమానంగా మారింది. వార్నర్‌ ప్లేస్‌లో టీ20లకు డీఆర్సీ షార్ట్‌ను ఎంపిక చేయగా, మూడో వన్డేకు వార్నర్‌ స్థానంలో లబూషేన్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. కాగా, వార్నర్‌ గాయంపై టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ జోక్స్‌ పేల్చాడు.

రెండో వన్డే ముగిసిన తర్వాత పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్పరెన్స్‌లో మాట్లాడిన రాహుల్‌కు వార్నర్‌ గాయం గురించి ప్రశ్న ఎదురు కాగా, మంచిదే కదా అంటూ నరదాగా వ్యాఖ్యానించాడు. అలా గాయంతో మ్యాచ్‌కు ఏ ఆటగాడు దూరం కావడాన్ని తాను కోరుకోనని, కాకపోతే వార్నర్‌ ఒక ప్రధాన ఆటగాడు కదా..అతను దూరమైతే తమ జట్టుకు మంచిదే నంటూ అక్కడున్నవారిలో నవ్వులు పూయించాడు

Tags :
|

Advertisement