Advertisement

  • డెత్ ఓవర్లలో రాణించిన చెన్నై బౌలర్లు ...సిఎస్కె ముందు 168 పరుగుల లక్ష్యం

డెత్ ఓవర్లలో రాణించిన చెన్నై బౌలర్లు ...సిఎస్కె ముందు 168 పరుగుల లక్ష్యం

By: Sankar Wed, 07 Oct 2020 9:53 PM

డెత్ ఓవర్లలో రాణించిన చెన్నై బౌలర్లు ...సిఎస్కె ముందు 168 పరుగుల లక్ష్యం


అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా జట్టు గౌరప్రదమైన స్కోర్ సాధించింది.

20 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది, కోల్ కతా ఓపెనర్ రాహుల్ త్రిపాఠి మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. రాహుల్ త్రిపాఠి 51 బంతుల్లో 81 పరుగులు చేశాడు. అయితే, జట్టులో మిగతా ఆటగాళ్లు ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు. దీంతో జట్టు 167 పరుగులు మాత్రమే చేసింది. మొదటి నుంచి రాహుల్ త్రిపాఠి దూకుడుగా ఆడటంతో ఈ స్కోర్ చేయగలింది.

చెన్నై ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే 168 పరుగులు చేయాల్సి ఉన్నది. గత మ్యాచ్ ద్వారా షేన్ వాట్సన్, డూప్లెసీస్ లు ఫామ్ లోకి వచ్చారు. ఇక మిడిల్ ఆర్డర్ లో ధోని, రాయుడు, బ్రేవో, జడేజాలు ఉండనే ఉన్నారు. ఈమ్యాచ్ లో చెన్నె ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Tags :
|
|
|

Advertisement