Advertisement

  • కెప్టెన్ గా కార్తిక్ వద్దు ..అతడిని నియమించండి ..కేకేఆర్ ఫాన్స్ డిమాండ్

కెప్టెన్ గా కార్తిక్ వద్దు ..అతడిని నియమించండి ..కేకేఆర్ ఫాన్స్ డిమాండ్

By: Sankar Sun, 04 Oct 2020 4:46 PM

కెప్టెన్ గా కార్తిక్ వద్దు ..అతడిని నియమించండి ..కేకేఆర్ ఫాన్స్ డిమాండ్


ఐపీయల్ లో పటిష్ట జట్లలో ఒకటయిన కోల్కతా నైట్ రైడర్స్ ఈ ఐపీయల్ అంతగా ఆకట్టుకోలేకపోతుంది..అత్యధిక ధర పలికిన కమ్మిన్స్ , ఇంగ్లాండ్ స్టార్ మోర్గాన్ , సిక్సర్ల వీరుడు రస్సెల్ ఉన్న కూడా కేకేఆర్ ఆకట్టుకోలేకపోతుంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిన తర్వాత.. కెప్టెన్‌ను మార్చాలనే డిమాండ్‌ను కొందరు ఫ్యాన్స్ తెరమీదకు తెచ్చారు. దినేశ్ కార్తీక్ బదులు ఇయాన్ మోర్గాన్‌కు నాయకత్వ పగ్గాలు అప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడి, రెండింట్లో గెలిచిన కోల్‌కతా పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉంది.

దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్ రైడర్స్ తప్పిదాల నుంచి త్వరగా నేర్చుకోలేకపోతోంది. రస్సెల్ లాంటి హిట్టర్లు ఉన్నప్పటికీ గత సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. ఇంగ్లాండ్‌కు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను ఈ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ చేస్తారని చాలా మంది భావించారు. కానీ అలా జరగలేదు.

వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్‌ను జట్టులో ఆడిస్తూ... జాతీయ జట్టులో చోటు దక్కని ఆటగాడికి కో‌ల్‌కతా కెప్టెన్సీ అప్పగించింది. కెప్టెన్ సరిగా ఆడకపోతే జట్టుపై ప్రభావం పడుతుంది.. సరిగా నాయకత్వం వహించకపోతే బ్యాటింగ్‌పై ప్రభావం పడుతుంది. దినేశ్ కార్తీక్ ఈ రెండు సమస్యలను ఎదుర్కొంటున్నాడ’ని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.ఇయాన్ మోర్గాన్‌ను కెప్టెన్ చేసి.. మూడు లేదా నాలుగో స్థానంలో ఆడించాలని.. అతణ్ని ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దింపడం వల్ల అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోందని కోల్‌కతా అభిమానులు వాపోతున్నారు



Tags :
|

Advertisement