Advertisement

  • ఉత్కంఠభరిత మ్యాచ్ లో సూపర్ ఓవర్లో విజయం సాధించిన కేకేఆర్

ఉత్కంఠభరిత మ్యాచ్ లో సూపర్ ఓవర్లో విజయం సాధించిన కేకేఆర్

By: Sankar Sun, 18 Oct 2020 8:24 PM

ఉత్కంఠభరిత మ్యాచ్ లో సూపర్ ఓవర్లో విజయం సాధించిన కేకేఆర్

ఐపీయల్ లో ఈ రోజు జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ , కేకేఆర్ జట్లు తలపడ్డాయి ..ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది..సూపర్ ఓవర్లో కేకేఆర్ జట్టు , వార్నర్ సేన మీద ఘనవిజయం సాధించింది..సూపర్‌ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ రెండు పరుగులే చేసింది. తొలి మూడు బంతులకు రెండు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది

కేకేఆర్‌ పేసర్‌ ఫెర్గ్యూసన్‌ తొలి బంతికి వార్నర్‌ను ఔట్‌ చేయగా, రెండో బంతికి రెండు పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి అబ్దుల్‌ సామద్‌ను బౌల్డ్‌ చేశాడు. దాంతో కేకేఆర్‌కు మూడు పరుగుల టార్గెట్‌ను మాత్రమే ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్దేశించింది. కేకేఆర్‌ సూపర్‌ ఓవర్‌లో మోర్గాన్‌-కార్తీక్‌లు దిగి జట్టుకు విజయాన్ని అందించారు. రషీద్‌ ఖాన్‌ వేసిన ఆ సూపర్‌ ఓవర్‌ నాల్గో బంతికి లెగ్‌ బైస్‌ రూపంలో రెండు పరుగులు రావడంతో కేకేఆర్‌ విజయం సాధించింది. రషీద్‌ వేసిన రెండో బంతికి పరుగు రాగా, మూడో బంతికి పరుగు రాలేదు. నాల్గో బంతికి దినేశ్‌ కార్తీక్‌ లెగ్‌ బై రూపంలో రెండు పరుగులు తీయడంతో కేకేఆర్‌ విక్టరీ నమోదు చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 163 పరుగులు చేయగా, ఎస్‌ఆర్‌హెచ్‌ కూడా నిర్ణీత ఓవర్లలో 163 పరుగులే చేసింది. చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్‌ విజయానికి 18 పరుగులు కావాల్సిన తరుణంలో 17 పరుగులే వచ్చాయి. రసెల్‌ వేసిన ఆ ఓవర్‌ తొలి బంతికి నో బాల్‌ వేశాడు. దాంతో నోబాల్‌కు పరుగు వచ్చింది. ఆ తర్వాత ఫ్రీహిట్‌ బంతికి రషీద్‌ ఖాన్‌ భారీ షాట్‌ కొట్టినా పరుగు మాత్రమే సాధించాడు. ఆ తర్వాత వార్నర్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టగా, ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి లెగ్‌ బై రూపంలో పరుగు మాత్రమే వచ్చింది. దాంతో టై అయ్యింది

Tags :
|
|

Advertisement