Advertisement

  • ఢిల్లీ క్యాపిటల్స్ కు షాకిచ్చిన కోల్కతా నైట్ రైడర్స్..

ఢిల్లీ క్యాపిటల్స్ కు షాకిచ్చిన కోల్కతా నైట్ రైడర్స్..

By: Sankar Sun, 25 Oct 2020 07:17 AM

ఢిల్లీ క్యాపిటల్స్ కు షాకిచ్చిన కోల్కతా నైట్ రైడర్స్..


ఐపీయల్ 2020 లో నిన్న సాయంత్రం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పైన కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది..దీనితో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని కాపాడుకుంది..ముందుగా బాటింగ్ లో రాణించిన కేకేఆర్ ఆ తర్వాత బౌలింగ్లో చెలరేగి ఢిల్లీ ని చిత్తూ చేసింది..ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ రెండవ స్థానంలోనే ఉంది..

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. నితీష్‌ రాణా(81; 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), నరైన్‌(64; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించడంతో కేకేఆర్‌ భారీ స్కోరు చేసింది. వీరు మెరుపులతో కేకేఆర్‌ 15 ఓవర్లలో 142 పరుగులు చేసింది. కాగా, నరైన్‌ 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేసి కేకేఆర్‌ విలువైన పరుగుల్ని అందించాడు.

లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్లు అజింక్యా రహానే(0), శిఖర్‌ ధావన్‌(6)లు నిరాశపరిచారు. వీరిద్దర్నీ కమిన్స్‌ తన వరుస ఓవర్లలో బోల్తా కొట్టించడంతో ఢిల్లీ 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌(47;38 బంతుల్లో 5ఫోర్లు), రిషభ్‌ పంత్‌(27; 33 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌)లు ఆకట్టుకునే యత్నం చేసినా కీలక భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోయారు.

ఈ జోడి 63 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించగా, ఆపై ఎవరూ కూడా రాణించకపోవడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఏడుగురు ఢిల్లీ ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్‌ ఐదు వికెట్లకు తోడుగా కమిన్స్‌ మూడు వికెట్లు సాధించగా ఫెర్గ్యూసన్‌కు వికెట్‌ లభించింది.సంచలన బౌలింగ్ ప్రదర్శనతో అయిదు వికెట్లు తీసిన కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు..

Tags :
|
|

Advertisement