Advertisement

'కిరణ్ శ్రుతి' ఈ ఏడాది ఉత్తమ ఐపీఎస్ ప్రొబేషనర్

By: chandrasekar Thu, 03 Sept 2020 1:51 PM

'కిరణ్ శ్రుతి' ఈ ఏడాది ఉత్తమ ఐపీఎస్ ప్రొబేషనర్


హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అతుల్ కార్వాల్.. తమిళనాడుకు చెందిన కిరణ్ శ్రుతి ఈ ఏడాది ఉత్తమ ఐపీఎస్ ప్రొబేషనర్‌ అని తెలిపారు.

ఈ నెల 4న జరిగే పాసింగ్ అవుట్ పరేడ్‌కు కిరణ్ సారథ్యం వహిస్తారని ఆయన తెలిపారు. వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి ఈ ఏడాది 131 మంది ఐపీఎస్ ప్రొబేషనర్లు శిక్షణ పొందారని, వీరిలో 28 మంది మహిళా ఐపీఎస్ పొబేషనర్లు ఉన్నట్లు వివరించారు.

ఈ నెల 4న జరిగే పాసింగ్ అవుట్ పరేడ్, గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో వీరంతా పాల్గొనబోతున్నారని అతుల్ కార్వాల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా వర్చువల్‌గా పాల్గొనేందుకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు.

Tags :
|
|

Advertisement