Advertisement

  • సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన అప్పటి వికెట్ కీపర్ కిరణ్ మోరే

సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన అప్పటి వికెట్ కీపర్ కిరణ్ మోరే

By: Sankar Sat, 04 July 2020 7:58 PM

సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన అప్పటి వికెట్ కీపర్ కిరణ్ మోరే



సునీల్ గవాస్కర్ ఇండియన్ క్రికెట్లో దిగ్గజ ఆటగాడు ..టెస్ట్ క్రికెట్లో తొలిసారి పదివేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచినా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ..అయితే ఇంతటి దిగ్గజ ఆటగాడు అయినా గవాస్కర్ గురించి అప్పటి అతడి సహచరుడు కిరణ్ మోరే ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు ..మైదానంలో అద్భుతంగా ఆడే గవాస్కర్ నెట్స్‌లో మాత్రం చెత్తగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడని వికెట్ కీపర్ గుర్తు చేసుకున్నాడు.

మ్యాచ్‌కి ముందు నెట్స్‌లో అత్యంత చెత్తగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది.. సునీల్ గవాస్కర్. అంత వరస్ట్‌గా ఎవరూ ప్రాక్టీస్ చేయరేమో.. ఒక్కోసారి ఇలా ప్రాక్టీస్ చేసి అతను ఎలా మ్యాచ్ ఆడతాడు.. అని అనిపించేది. కానీ.. మ్యాచ్‌లో నెట్స్‌తో పోలిస్తే 99.9 శాతం భిన్నంగా బ్యాటింగ్ చేసి అబ్బురపరిచేవాడు’’ అని వెల్లడించాడు.

సునీల్ గవాస్కర్ డకౌట్ లేదా 5-10 పరుగుల వద్ద ఔటైతే ఏమీ ఫీలవ్వడు. కానీ.. గంట క్రీజులో నిలిచి 30-40 పరుగుల వద్ద ఔటైతే మాత్రం.. డ్రెస్సింగ్ రూములోకి వచ్చి గ్లౌవ్స్‌ని విసిరేసేవాడు. అలా ఎలా ఔటయ్యా.. అంటూ గట్టిగా అరిచేవాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత భారీ స్కోర్లు చేయకుండా ఔటవడం అతనికి నచ్చేది కాదు’’ అని కిరణ్ మోరే వివరించాడు.


Tags :
|

Advertisement