Advertisement

MI VS Kings Xi Punjab ...టాస్ గెలిచి పంజాబ్ బౌలింగ్

By: Sankar Thu, 01 Oct 2020 7:25 PM

MI VS Kings Xi Punjab   ...టాస్ గెలిచి పంజాబ్ బౌలింగ్


ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ కింగ్స్‌ పంజాబ్‌ టాస్‌ గెలిచి ఫీల్దింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌.. ముందుగా ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఇరుజట్లు తలో మూడు మ్యాచ్‌లు ఆడగా ఒకదాంట్లో మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించాయి. ఆర్సీబీపై కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించగా, కేకేఆర్‌పై ముంబై విజయం సాధించింది.

ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంటుంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండటంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గౌతమ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. లెగ్‌ స్పిన్నర్‌ స్థానంలో మురుగన్‌ అశ్విన్‌ స్థానంలో ఆఫ్‌ స్పిన్నర్‌ గౌతమ్‌ను తీసుకున్నారు. ఇక ముంబై ఇండియన్స్‌ గత మ్యాచ్‌ ఆడిన జట్టుతోనే పోరుకు సిద్ధమైంది.ఇక ఇరు జట్ల మధ్య ఇప‍్పటివరకూ 24 మ్యాచ్‌లు జరగ్గా అందులో ముంబైదే పైచేయిగా ఉంది. ముంబై 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కింగ్స్‌ పంజాబ్‌ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వివరాలు : కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, నికోలస్‌ పూరన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, కరుణ్‌ నాయర్‌, నీషమ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, గౌతమ్‌, మహ్మద్‌ షమీ, షెల్డాన్‌ కాట్రెల్‌, రవి బిష్నోయ్‌

ముంబై ఇండియన్స్ జట్టు వివరాలు :రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్యా, జేమ్స్‌ పాటిన్‌సన్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా


Tags :
|

Advertisement