Advertisement

  • అంపైర్ తప్పిదానికి బలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్

అంపైర్ తప్పిదానికి బలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్

By: chandrasekar Mon, 21 Sept 2020 5:16 PM

అంపైర్ తప్పిదానికి బలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) 6 నెలలు ఆలస్యంగా ప్రారంభమైనా.. రెండో రోజే అసలైన మజాను అందించింది. రెండో మ్యాచ్‌లోనే సూపర్ ఓవర్‌కు దారి తీసి క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని అందించింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అంపైర్ తప్పిదానికి బలైంది. మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్నిచేజిక్కించుకుంది. కానీ పంజాబ్ మాత్రం గెలిచినా ఓడింది.

158 పరుగుల లక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్ చేస్తోంది. మయాంక్ అగర్వాల్ (89, 60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో గెలిచేలా కనిపించింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ రబాడ వేశాడు. ఆ ఓవర్‌లో 3వ బంతిని మయాంక్ ఆడగా.. రెండు పరుగులు తీశారు. అయితే క్రిస్ జోర్డాన్ బ్యాట్‌ను క్రీజులో ఉంచలేదని లెగ్ అంపైర్ నితిన్ మేనన్ ఓ పరుగు తగ్గించిన విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 13 రన్స్ అవసరంగా కాగా 12 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. వాస్తవానికి టీవీ రీప్లే గమనిస్తే జోర్డాన్ బ్యాట్‌ను పూర్తిగా క్రీజులోకి తీసుకెళ్లిన తర్వాతే రెండో పరుగు తీశాడని స్పష్టంగా కనిపించింది. అయితే మ్యాచ్ ఓటమికి ఆ ఒక్క పరుగే కారణం కావడంతో అంపైర్ల తప్పిదంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్ ఓటమికి అంపైర్లు కోత విధించిన షార్ట్ రనే కారణమ౦ అయ్యింది.

Tags :
|
|
|

Advertisement