Advertisement

  • రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పై 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పై 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్

By: chandrasekar Fri, 25 Sept 2020 08:59 AM

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పై 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్


యూఏఈ వేదికగా జరిగే ఐపీల్ మ్యాచ్ లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు పై 97 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్ ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌ 2020లో 6వ మ్యాచ్‌లో భాగంగా గురువారం రాత్రి కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై పంజాబ్‌ జట్టు ఘన విజయం సాధించింది. ఏకంగా 97 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సొంతం చేసుకుంది. పంజాబ్ కెప్టేన్ కేఎల్ రాహుల్ బాదేయడంతో ఏకంగా 14ఫోర్లు, 7 సిక్సర్లతో 132 పరుగుల భారీ స్కోరుతో జట్టుకు భారీ విజయం అందించాడు. రాహుల్ బౌండరీల సునామితో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 207 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగి లక్ష్య ఛేదనలో ఏ దశలోనూ పంజాబ్ జట్టు స్కోరును అందుకునే పరిస్థితి కనిపించకపోగా 17 ఓవర్లకే 109 పరుగులకే ఆలౌట్ అయిన తీరు చూస్తే పంజాబ్ జట్టు బౌలర్లు బెంగళూరు బ్యాట్స్‌మెన్స్‌ని ఎంత కట్టడి చేశారో ఇట్టే అర్థమవుతుంది. RCB ఆటగాళ్లలో ఆరోన్ ఫించ్‌ (20), ఏబి డివిలియర్స్‌ (28), వాషింగ్టన్‌ సుందర్‌ (30), శివం దూబే (12)లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

మొదటి మ్యాచ్ లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మంచి ఫోరంలో కనిపించింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన తొలి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన ఓపెనర్‌ దేవదూత్‌ పడిక్కల్‌ కూడా ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్ బాటపట్టాడు. జోష్‌ ఫిలిప్పి డకౌట్‌ అయ్యాడు. పంజాబ్ బౌలింగ్ ను ఏడుకోవడంలో బెంగళూరు బాగా ఇబ్బంది పడ్డారు. కష్టకాలంలో జట్టును గట్టెక్కించే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం కాట్రెల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రవి బిష్నోయ్‌ చేతికి అడ్డంగా దొరికిపోయాడు. ముఖ్యమైన ఆటగాళ్లే ఏమీ చేయలేనట్టు చేతులెత్తేయడంతో ఆ తర్వాతి ఆటగాళ్లంతా వాళ్ల బాటలోనే పెవిలియన్ చేరుకున్నారు. ఫలితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 97 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కెప్టెన్ విరాట్ కోలి జట్టు ఇంత గోరంగా పరాజయం పొందడంతో బెంగుళూరు అభిమానులంతా చాలా నిరాశకు లోనయ్యారు.

Tags :

Advertisement