Advertisement

  • కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రాక్టీస్‌

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రాక్టీస్‌

By: Dimple Sat, 29 Aug 2020 01:36 AM

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రాక్టీస్‌

దుబాయిలో ఉంటున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు దుబాయ్ లోని ఐసిసి అకాడమీలో కసరత్తు మొదలుపెట్టాయి. ఆరు రోజుల నిర్బంధం యొక్క అన్ని తప్పనిసరి విధానాలను అధిగమించిన తరువాత, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. ”169 రోజుల తరువాత, తిరిగి రావడం మంచిది’ అని ఈ సందర్భంగా కెఎల్ రాహుల్‌ తన మనసులోమాటను పేర్కొన్నారు.

ఐపీఎల్‌ మార్గదర్శకాలతో తొలిసారిగా దుబాయ్‌లో కాలుమోపిన కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ ఆరు రోజుల నిర్భంధ క్వారంటైన్‌ ను పూర్తి చేసింది.
ఫ్రాంచైజ్ ఇప్పుడు దుబాయిలోని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం ఆనుకుని ఉన్న ఐసీసీ అకాడమీ క్రీడా ప్రాంగణంలో శారీరక వ్యాయామాలు... నెట్‌ ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. బుధవారం రాత్రి ప్రాక్టీసు చేసిన తర్వాత... గురువారం ఉదయం... సాయంత్రం సమయాల్లో సభ్యులతో కలిసి నెట్స్‌లోకి రావడంతో కింగ్స్‌ కెప్టన్‌ రాహుల్‌ ఆనందం వ్యక్తంచేశాడు.

పగటిసమయంలో ఉక్కపోత ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నాడు. యుఎఇలో పరిస్థితులలో ఉష్ణోగ్రతలు సాధారణంగా ఆడటం కంటే వేడిగా ఉన్నాయనే భావన వ్యక్తంచేశాడు. ఇక్కడ నెట్‌ సెషన్‌ బాగుందంటూ... ఇంతకాలం ఇంట్లో ఉండి, జట్టుతో కలిసి ఉండటానికి అవకాశం పొందడం నిజంగా మంచి అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. తమ జట్టు ఆనందంతో ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన ఫోటోలను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అధికారిక ట్విట్టర్‌లో పోస్టుచేశారు.

" సాధారణంగా చల్లగా ఉండే వాతావరణంలో బ్యాటింగ్ చేయటానికి ఇష్టపడతాను. ఇక్కడ పరిస్థితులు చాలా వేడిగా ఉన్నాయి, ఆరుబయట ఉండటం మరియు ప్రాక్టీస్ చేయడం మరియు మనం ఇష్టపడేదాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది" అని రాహుల్‌ పేర్కొన్నారు.

ఇకపోతే రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకూడా... ఐసీసీ అకాడమీ ఆవరణలో ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. సంజూ శాంసన్‌, రాబిన్‌ ఊతప్ప, యశస్వీ జైశ్వాల్‌, అనిరుద్ధ జోషి, మనన్‌ వోరా, శ్రేయాస్‌ గోపాల్‌, వరుణ్‌ ఆరోన్‌, శశాంక్‌ సింగ్‌ ప్రాక్టీస్‌ సెషన్లో బ్యాటింగ్‌ షాట్లు, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ వంటి ఈవెంట్లతో సాధన చేశారు. ప్రాక్టీస్‌ ఆద్యంతం ఉక్కపోతతో అల్లాడిపోయారు. రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌ మెన్‌ రియాన్‌ పరాగ్‌ మాత్ర తమ కెప్టన్‌ స్టీవ్‌ స్మిత్‌ అభినందనలతో స్ఫూర్తి పొంది ఈ సీజన్లో అత్యధిక స్కోరు సాధనపై దృష్టి సారించాడు.

Tags :
|
|
|

Advertisement