Advertisement

రాహుల్ వీర విధ్వంసం ..చిత్తుగా ఓడిన ఆర్సీబి

By: Sankar Fri, 25 Sept 2020 06:07 AM

రాహుల్ వీర విధ్వంసం ..చిత్తుగా ఓడిన ఆర్సీబి


కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కె ఎల్ రాహుల్ వీర విధ్వంసం సృష్టించాడు..ఆర్సీఐబి జట్టుతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు..బౌలర్ ఎవరైనా సరే బంతి బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకుని బౌలర్లను ఊచకోత కొసతు ఐపీల్ 2020 లో తొలి సెంచరీ నమోదు చేసాడు..రాహుల్ దెబ్బకు గురువారం జరిగిన పోరులో పంజాబ్‌ 97 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం సాధించింది.

ముందుగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లోకేశ్‌ రాహుల్‌ (69 బంతుల్లో 132 నాటౌట్‌; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్‌ సుందర్‌ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌.

ఇక భారీ లక్ష్యం ముందుంటే బెంగళూరు బాధ్యతే మరిచింది. మొదటి 16 బంతులకే పరాజయానికి బాటలు వేసుకుంది. తొలి ఓవర్లో పడిక్కల్‌ (1), రెండో ఓవర్లోనే ఫిలిప్‌ (0), మూడో ఓవర్లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కోహ్లి (1) ఔటయ్యారు. కాట్రెల్‌ దెబ్బకు 4 పరుగులకే 3 టాప్‌ వికెట్లను కోల్పోవడంతో ఆర్‌సీబీ పరాజయం వైపు మళ్లింది. రవి బిష్ణోయ్‌ అద్భుతమైన డెలివరీకి ఫించ్‌ (21 బంతుల్లో 20; 3 ఫోర్లు) బౌల్డ్‌ కాగా, ఆపై డివిలియర్స్‌ (18 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్‌) వల్లా కాలేదు. ఆ తర్వాత సుందర్‌ మినహా... అంతా విఫలం కావడంతో బౌలర్లకు 20 ఓవర్లు వేసే శ్రమ తప్పింది. అవతలివైపు రాహు ల్‌ ఒక్కడే 14 ఫోర్లు కొడితే ఇక్కడ మాత్రం అంతాకలిసి కొట్టిన ఫోర్లు (10), సిక్స్‌లు (3) కూడా ఆ సంఖ్యను చేరలేకపోయాయి.

ఇక ఇన్నింగ్స్‌లో సగానికి పైగా బంతులు (69) ఎదుర్కొన్న రాహుల్‌ చివరి వరకు నిలబడి పరుగుల వరద పారించాడు. తొలి ఓవర్‌లో ఫైన్‌ లెగ్‌లో మొదలైన బౌండరీల ప్రవాహం అదే రీతిలో కొనసాగింది. ఉమేశ్‌ వేసిన పదో ఓవర్లో రాహుల్‌ డీప్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో సిక్స్, ఫైన్‌లెగ్‌లో ఫోర్‌ కొట్టాడు. 12వ ఓవర్లో అతని అర్ధసెంచరీ (36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) పూర్తికాగా, జట్టు 100 పరుగులకు చేరింది. ఇక సిక్సర్లయితే అన్ని భారీ స్థాయిలో కొట్టాడు..స్టెయిన్ వంటి అల్ టైం గ్రేట్ బౌలర్ కూడా రాహుల్ విధ్వంసాన్ని ఆపలేకపోయాడు...

Tags :
|

Advertisement