Advertisement

  • మయాంక్ అగర్వాల్ వీర విధ్వంసం ...రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

మయాంక్ అగర్వాల్ వీర విధ్వంసం ...రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

By: Sankar Sun, 27 Sept 2020 10:00 PM

మయాంక్ అగర్వాల్ వీర విధ్వంసం ...రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం


ఐపీఎల్ 2020 లో ఈ రోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ షార్జా వేదికగా జరుగుతుంది. అయితే ఈ గ్రౌండ్ చిన్నది కావడంతో పంజాబ్ ఓపెనర్లు రెచ్చిపోయారు. 16 ఓవర్ల వరకు వికెట్ కూడా పడకుండా 183 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు మయాంక్ అగర్వాల్, లోకేష్ రాహుల్.

అగర్వాల్ 50 బంతుల్లో 7 సిక్స్ లు, 10 ఫోర్లతో మొత్తం 106 పరుగులు చేయగా కెప్టెన్ రాహుల్ 54 బంతుల్లో ఒక సిక్స్, 7 ఫోర్లతో 69 పరుగులు చేసాడు. కానీ ఆ తర్వాత ఇద్దరు వెంటవెంటనే పెవిలియన్ కు చేరుకున్నారు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన నికోలస్ పూరన్ 8 బంతుల్లో 25 పరుగులతో కొన్ని మెరుపులు మెరిపించడంతో పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో టామ్ కుర్రాన్, అంకిత్ రాజ్‌పూట్ చెరొక వికెట్ తీసుకున్నారు.

అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే రాయల్స్ 224 పరుగులు చేయాలి. మాములుగా అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టం. కానీ షార్జా గ్రౌండ్ చిన్నది కావడంతో రాజస్థాన్ కు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Tags :
|

Advertisement