Advertisement

  • తండ్రి చనిపోయిన బాధలో ఉండి కూడా బరిలోకి దిగిన పంజాబ్ యువ ఆటగాడు...

తండ్రి చనిపోయిన బాధలో ఉండి కూడా బరిలోకి దిగిన పంజాబ్ యువ ఆటగాడు...

By: Sankar Sun, 25 Oct 2020 2:38 PM

తండ్రి చనిపోయిన బాధలో ఉండి కూడా బరిలోకి దిగిన పంజాబ్ యువ ఆటగాడు...


ఐపీయల్ లో ఒక దశలో అందరికంటే ముందే ఎలిమినేట్ అవుతుంది అని భావించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుస విజయాలతో ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది..నిన్న రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో నుంచి విజయాన్ని లాగేసుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్..

మన్‌దీప్ తండ్రి ఆరోగ్యం గత కొంత కాలంగా బాగోలేదు. గత వారం రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. శుక్రవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో మన్‌దీప్ తండ్రి మరణానికి సంతాప సూచికగా.. పంజాబ్ ఆటగాళ్లు చేతికి నల్లటి రిబ్బన్లు కట్టుకొని మ్యాచ్‌లో బరిలోకి దిగారు.

ఈ విజయాన్ని మన్‌దీప్ సింగ్ తండ్రికి అంకితమిచ్చింది. మ్యాచ్ ముందు రోజు రాత్రి మన్‌దీప్ సింగ్ తండ్రి మరణించారు. తనను ఇంతటి వాణ్ని చేసిన తండ్రి చనిపోయిన బాధను దిగమింగుతూనే.. మనదీప్ సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో బరిలో దిగాడు.ఈ మ్యాచ్‌‌కు మయాంక్ అగర్వాల్ దూరం కావడంతో.. అతడి స్థానంలో ఓపెనర్‌గా ఆడిన మన్‌దీప్ 14 బంతుల్లో 17 రన్స్ చేసి.. తొలి వికెట్‌కు రాహుల్‌తో కలిసి 37 రన్స్ జోడించాడు

Tags :
|
|

Advertisement