Advertisement

  • సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే మా దేశంలో కరోనా కేసులు నమోదు కాలేదు ..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే మా దేశంలో కరోనా కేసులు నమోదు కాలేదు ..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

By: Sankar Fri, 03 July 2020 7:00 PM

సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే మా దేశంలో కరోనా కేసులు నమోదు కాలేదు ..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్



ప్రపంచం మొత్తం కరోనా దాటికి అల్లకల్లోలం అయింది ..అగ్ర రాజ్యం , పేద దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాలు కరోనా మహమ్మారి బారిన పడ్డాయి ..అయితే ఒక్క దేశం మాత్రం కరోనా విషయంలో ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు ..అసలు మా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు అని చెబుతుంది ..ఆదేశమే ఉత్తర కొరియా ..ఉత్తర కొరియాకు అనుకుని ఉన్న చైనా , దక్షిణ కొరియా కరోనా తాకిడికి వేల సంఖ్యలో కేసులు నమోదు అయితే వాటిని అనుకోని ఉన్న ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అంటే ఆశ్చర్యం కలుగక మానదు ..

ఈ విషయాన్ని గురువారం నాటి సమావేశంలో మరోసారి పునరుద్ఘాటించిన కిమ్‌.. ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభంలో మునిగిపోయిన వేళ తమ దేశం మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పరిస్థితి చేజారలేదని వ్యాఖ్యానించారు. అయితే పొరుగు దేశాల్లో ఇప్పటికీ మహమ్మారి విజృంభిస్తోందని.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇక ఉత్తర కొరియా అధికార వార్తా పత్రిక ఈ సమావేశానికి హాజరైన కిమ్‌, ఇతర అధికారుల ఫొటోలను ప్రముఖంగా ప్రచురించింది. అయితే ఇందులో కిమ్‌తో సహా ఎవరూ కూడా మాస్క్‌ ధరించకపోవడం గమనార్హం.

మీడియా సమావేశంలో కిమ్‌ మాట్లాడుతూ... ‘దేశంలో కరోనా కట‍్టడికి చేపట్టిన చర్యలు సత్పలితాలిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీనిని ‘షైన్‌ సక్సెస్‌’గా చెప్పాలి. అలా అని ఊపిరి పీల్చుకోవడానికి వీలులేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. మన పొరుగు దేశమైన చైనాలో మహమ్మారి తగ్గుముఖం పట్టి మళ్లీ వ్యాపిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించారు.

Tags :
|
|

Advertisement