Advertisement

  • ఉత్తర కొరియా లో తన ఆధిక్యతను చాటుకున్న కిమ్ చెల్లి కిమ్ యో జోంగ్

ఉత్తర కొరియా లో తన ఆధిక్యతను చాటుకున్న కిమ్ చెల్లి కిమ్ యో జోంగ్

By: chandrasekar Mon, 15 June 2020 11:26 AM

ఉత్తర కొరియా లో తన ఆధిక్యతను చాటుకున్న కిమ్ చెల్లి కిమ్ యో జోంగ్


కిమ్‌జాంగ్ ఉన్ ఏప్రిల్ 11 నుంచి వార్తల్లో కనిపించడం లేదు. ఆయుధాలపై మక్కువ, కయ్యానికి కాలుదువ్వే తత్వంతో ఇరుగు పొరుగు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు కిమ్‌జాంగ్. అభివృద్ధినే నమ్ముకున్న దేశం దక్షిణ కొరియా. ఫలితంగా శాంసంగ్ లాంటి ప్రపంచస్థాయి కంపెనీలు ఆ దేశం నుంచి ఆవిర్భవించాయి. ఆయుధాలనే నమ్ముకున్న దేశం ఉత్తర కొరియా. ఫలితంగా అమెరికా సైతం భయపడే స్థాయిలో ప్రమాదకరంగా మారింది నార్త్ కొరియా. అక్కడి నియంత కిమ్ జోంగ్ ఉన్ సంగతి మనకు తెలిసిందే. తను పట్టిన కుందేలుకు కాళ్లు ఉండవు అని చెబితే ఉత్తర కొరియాలో అందరూ ఒప్పుకుంటారు. కాదని ఎదురు తిరిగితే తల ఉండదు. అలాంటి కిమ్ జోంగ్ ఉన్ కూడా ఈమధ్య అనారోగ్యంతో కనుమరుగయిన తరుణంలో అన్న వెంటే ఉంటూ అన్నీ తెలుసుకుంటూ పట్టుదల, నియంత్రృత్వంలో అన్న కంటే రెండాకులు ఎక్కువ చదివిన చెల్లి కిమ్ యో జోంగ్ ఇప్పుడు ప్రమాదకర శక్తిగా ఎదుగుతున్నారు. తాజాగా ఆమె దక్షిణ కొరియాకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి చేరారంటే కిమ్ కథ ముగిసినట్లే అనుకోవాలేమో.

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అంటే సహజంగానే ప్రపంచంలో చాలా మందికి కోపం. ఆయన అత్యంత దారుణ శిక్షలు వేయిస్తాడని చాలా మంది భావిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం దెబ్బతిందనీ, విషమించిందనీ, ఆయనకు హార్ట్ సర్జరీ తర్వాత పరిస్థితి బాలేదని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన అలికిడి లేకపోవడంతో అంతా చనిపోయాడని భావించారు. కానీ దేశంలోని కొన్నివర్గాలు అందించిన సమాచారం ప్రకారం కిమ్ ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు తెలిసింది. బతికి బయటపడటం అనుమానమే అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Tags :

Advertisement