Advertisement

  • కియా మోటార్స్‌ యొక్క కొత్త కారు 'కియా సోనెట్' ఫోటోల విడుదల

కియా మోటార్స్‌ యొక్క కొత్త కారు 'కియా సోనెట్' ఫోటోల విడుదల

By: chandrasekar Fri, 31 July 2020 10:02 AM

కియా మోటార్స్‌ యొక్క కొత్త కారు 'కియా సోనెట్' ఫోటోల విడుదల


సౌత్ కొరియా ప్ర‌ముఖ కార్ల సంస్థ‌ కియా మోటార్స్‌ ఇండియా తాము త్వరలో మార్కెట్‌లో విడుదల చేయనున్న కియా సోనెట్ కారు యొక్క ఫోటోల‌ను విడుద‌ల చేసింది. ఆగస్టు 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తొలిసారిగా విడుదల చేయనున్న ఈ కారు యొక్క ఎక్స్‌టీరియర్‌ మరియు ఇంటీరియర్‌ చిత్రాలను గురువారం అధికారికంగా విడుదల చేసింది.

యువతరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని కారు కంపాక్ట్‌ ఎస్‌యూవీని రూపొందించిన‌ట్టు కియా డిజైన్‌ సెంటర్‌ – కియా మోటార్స్‌ కార్పోరేషన్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్ కరీమ్‌ హబీబ్ తెలిపారు. వినూత్నమైన స్పోర్టీ యాటిట్యూడ్‌, డైనమిక్‌ సిల్‌హ్యుటీతో అందిస్తున్నామ‌ని అన్నారు. విభిన్నమైన రంగుల్లో, మాన్యువల్‌ ట్రాన్సిమిషన్ తో ప్రత్యేక మైన ఫీచర్లు ఈ కారులో ఉంటాయ‌ని చెప్పారు.

ఈ కారు లో క్లచ్‌లెస్‌ మాన్యువల్‌ ట్రాన్సిమిషన్ ప్ర‌త్యేక‌త అని తెలిపారు. 10.25 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్ర్కీన్, ‌ యువీఓ కనెక్టడ్‌ టెక్నాలజీస్ నేవిగేషన్ సిస్ట‌మ్‌, ‌భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఇంకా మ‌రెన్నో ఫీచ‌ర్స్ ఉంటాయ‌ని చెప్పారు. ఈ కారు యొక్క ధ‌ర‌ రూ.8 లక్షల నుంచి రూ.13 లక్షలు వ‌ర‌కు ఉంటుంద‌ని తెలిపారు.

Tags :
|

Advertisement