Advertisement

  • రాజ్యసభ సభ్యత్వం రేసులో ప్రముఖ సినీనటి ఖుష్బూ?

రాజ్యసభ సభ్యత్వం రేసులో ప్రముఖ సినీనటి ఖుష్బూ?

By: chandrasekar Sat, 07 Nov 2020 4:54 PM

రాజ్యసభ సభ్యత్వం రేసులో ప్రముఖ సినీనటి ఖుష్బూ?


తమిళనాడు లో ప్రముఖ నటి ఖుష్బూ ఇటీవలే కాంగ్రెస్ నుండి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ప్రముఖ సినీనటి ఖుష్బూకు రాజ్యసభ సభ్యత్వం వరించనుంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానవర్గం ఖుష్బూను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని భావిస్తోంది. జూన్‌లో కర్ణాటకలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వారిలో ఒకరైన అశోక్‌ గస్తీ ఇటీవల కరోనా సోకి మృతి చెందారు. దీంతో కర్నాటకలో ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరగాల్సి వుంది. డిసెంబర్‌ ఒకటిన ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ సీటుకు ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై బీజేపీ అధిష్టానవర్గం పార్టీ సీనియర్‌ నేతలతో చర్చలు జరుపుతోంది.

కాళీగా వున్న సీటు కోసం అభ్యర్థి ఎంపికపై జరుగుచున్నది. కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు రాజ్యసభకు ఎన్నిక కావడం ఆనవాయితీగా వస్తోంది. ఆ మేరకు తమిళనాడుకు చెందిన పార్టీ ప్రముఖుల్లో ఒకరిని రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానవర్గం నిర్ణయించింది. వచ్చే యేడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా రాష్ట్రానికి చెందిన పార్టీ ప్రముఖుల్లో ఒకరిని రాజ్యసభకు ఎంపిక చేస్తే సమంజసంగా ఉంటుందని, ఈ నిర్ణయం పార్టీ విజయానికి దోహదం చేస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా భావిస్తున్నారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడానికి రాష్ట్రానికి చెందిన ముగ్గురు పార్టీ ప్రముఖుల పేర్లు బీజేపీ అధిష్టానవర్గం పరిశీలనలో ఉన్నాయి.

ఇందుకోసం పరిశీలనలో వున్న వ్యక్తుల్లో కర్ణాటకలో జన్మించి, తమిళనాట సూపర్‌స్టార్‌గా నీరాజనాలందు కుంటున్న రజనీకాంత్‌, కర్ణాటక రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారిగా సేవలందించి, ఆ పదవికి రాజీనామా చేసి ఇటీవలే బీజేపీలో చేరిన ఐపీఎస్‌ అధికారి అన్నామలై, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ సినీ నటి ఖుష్బూ పేర్లు బీజేపీ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు స్థానిక పార్టీ నాయకులు చెబుతున్నారు. వీరిలో రజనీకాంత్‌ బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్లేందుకు అంగీకరించరని తెలుస్తోంది. మిగిలిన ఇద్దరిలో నటి ఖుష్బూను రాజ్యసభకు ఎంపిక చేస్తే రాష్ట్రంలో పార్టీకి ఇమేజ్‌ మరింత పెరుగుతుందని బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు భావిస్తున్నారు. ఈ నెల పది తర్వాత ఇద్దరిలో ఒకరిని బీజేపీ అధిష్టానం ఎంపిక చేస్తుందని, మెజారిటీ నేతల అభిప్రాయం మేరకు ఖుష్బూకు ఆ పదవి వరిస్తుందని తెలుస్తోంది. మరి ఎవరు గెలుచుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

Tags :

Advertisement