Advertisement

  • బ్రేవో ని చూసి నవ్వలేదు ..నా నవ్వుకు వేరే కారణం ఉంది ..ఖలీల్ అహ్మద్

బ్రేవో ని చూసి నవ్వలేదు ..నా నవ్వుకు వేరే కారణం ఉంది ..ఖలీల్ అహ్మద్

By: Sankar Thu, 15 Oct 2020 9:14 PM

బ్రేవో ని చూసి నవ్వలేదు ..నా నవ్వుకు వేరే కారణం ఉంది ..ఖలీల్ అహ్మద్


చెన్నై సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే ..అయితే ఆ మ్యాచ్ లో చెన్నై బాటింగ్ సందర్భంగా బ్రేవో వికెట్ తీసిన ఖలీల్ అహ్మద్ సెలబ్రేషన్ ఏమి చేసుకోలేదు కానీ ఒక చిన్న నవ్వు నవ్వాడు ..ఇప్పుడు ఆ నవ్వే అతడి మీద విమర్శలను గుప్పిస్తుంది ..

ఒక సీనియర్‌ అంతర్జాతీయ క్రికెటర్‌ అయిన బ్రావోకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా ' అంటూ మండిపడ్డారు. దీనితో పాటు ఖలీల్‌పై నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు.' ఖలీల్‌ చాలా రూడ్‌గా ప్రవర్తించాడు. ప్రతీ క్రికెటర్‌ ఎంతో కొంత స్పోర్టివ్‌ ప్రదర్శిస్తాడు. కానీ ఖలీల్‌కు కనీసం అది కూడా లేదు.. తెవాటియాతోనూ ఇలాంటిదే చేశావు.. షేమ్‌ ఆన్‌ యూ.. ఖలీల్‌కు అసలు క్రీడా స్పూర్తి అనేదే లేదు.. అంటూ మండిపడ్డారు.

అయితే దీనిపై ఖలీల్‌ అహ్మద్‌ స్పందించాడు. నేను బ్రావోను చూసి నవ్వలేదు. 'నా నవ్వు వెనుక అసలు కారణం అది కాదు. అయినా బ్రావో లాంటి ఆటగాడిపై నేను అలా ప్రవర్తిస్తానా చెప్పండి. అయినా నేను బ్రావోను అన్నలాగా భావిస్తాను. దయచేసి దీనిని పెద్ద ఇష్యూ చేయకండి.' అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

Tags :
|
|

Advertisement