Advertisement

  • వ్యాక్సినేషన్ గురించి ఈటల కీలక వ్యాఖ్యలు...పేదలు, కూలీలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్

వ్యాక్సినేషన్ గురించి ఈటల కీలక వ్యాఖ్యలు...పేదలు, కూలీలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్

By: chandrasekar Sat, 24 Oct 2020 5:18 PM

వ్యాక్సినేషన్ గురించి ఈటల కీలక వ్యాఖ్యలు...పేదలు, కూలీలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్


హైదరాబాద్: హోం మంత్రి ఈటల రాజేందర్ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే బిహార్ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు, అస్సాంలో వ్యాక్సిన్‌‌ను ఫ్రీగా అందిస్తామని అధికార పార్టీ నేతలు అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో వ్యాక్సినేషన్ గురించి మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు వ్యాక్సిన్‌‌ను ఉచితంగా అందిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా కలిగించాలని ఈటల పేర్కొన్నారు.

వ్యాక్సిన్ ధర ఎంతనేది పెద్ద విషయం కాదని, ఎవరైతే ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తారో వారికి ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తామన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తొలుతగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని హెల్త్ కేర్ వర్కర్స్‌‌కు వ్యాక్సిన్‌‌ను అందిస్తామన్నారు. ఆ తర్వాత పేదలు, రోజు వారీ కూలీలకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన సూచనల కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. టీకాల విషయంలో ఆర్థిక అంశాన్ని చూడరాదని, ప్రతి ఒక్కరికీ అందించడమే టార్గెట్‌‌గా ఉండాలన్నారు. ఏయే సెక్షన్ల ప్రజలకు ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ఇవ్వాలో వైద్యశాఖ ఇప్పటికే ముసాయిదాను తయారు చేసిందని తెలిపారు.

Tags :
|

Advertisement