Advertisement

  • మరొకసారి లాక్ డౌన్ విధించాల్సి రావొచ్చు ..కేరళ మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరొకసారి లాక్ డౌన్ విధించాల్సి రావొచ్చు ..కేరళ మంత్రి సంచలన వ్యాఖ్యలు

By: Sankar Tue, 29 Sept 2020 07:43 AM

మరొకసారి లాక్ డౌన్ విధించాల్సి రావొచ్చు ..కేరళ మంత్రి సంచలన వ్యాఖ్యలు


దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 60 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా కేరళ రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలను పగడ్బందీగా అమలు చేయడం వలన కేసులు అదుపులో ఉన్నాయి.

అయితే ఓనం పండుగ తరువాత రాష్ట్రంలో కేసులు క్రమంగా పెరగడం మొదలుపెట్టాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్రం అప్రమత్తం అయ్యింది. కేసుల సంఖ్య ఆందోళన కరంగా ఉందని, కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తేనే కేసులు అదుపులో ఉంటాయని, లేదంటే తిరిగి లాక్ డౌన్ ను అమలు చేయాల్సి వస్తుందని కేరళ మంత్రి శైలజ పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలిగిన వ్యక్తులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్టు ఆమె తెలిపారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతిరోజు దేశంలో 80వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా నిబంధనలను పూర్తిగా ఎత్తివేస్తే కరోనాను అదుపుచేయడం మరింత కష్టం అవుతుంది..కాగా ఇంకొక రెండు రోజుల్లో అన్లాక్ 4 మార్గదర్శకాలు పూర్తి అవుతున్నందున, కేంద్రం కొత్తగా అన్లాక్ 5 మార్గదర్శకాలు రిలీజ్ చేస్తుంది

Tags :
|

Advertisement