Advertisement

  • ఆరేళ్ళ లోపు పిల్లల సంరక్షణలో ఆ రాష్ట్రానిదే అగ్రస్థానం

ఆరేళ్ళ లోపు పిల్లల సంరక్షణలో ఆ రాష్ట్రానిదే అగ్రస్థానం

By: Sankar Sun, 06 Sept 2020 12:44 PM

ఆరేళ్ళ లోపు పిల్లల సంరక్షణలో ఆ రాష్ట్రానిదే అగ్రస్థానం


ఆరేళ్ళలోపు పిల్లల ఆరోగ్య సంరక్షణలో టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది కేరళ. ఇదే కేటగిరీలో బిహార్ చివరి స్ధానంలో నిలిచింది. అనేక అంశాలతో రాష్ట్రాల‌కు ఈ స్థానాల‌ను కేటాయించింది కేంద్రం.

ఉప‌రాష్ట్రప్రతి వెంక‌య్య నాయుడు విడుద‌ల చేసిన.. 'స్టేట్ ఆప్ ద యూత్ చైల్డ్ ఇన్ ఇండియా' అనే పుస్తకంలో ఈ నివేదికను పొందుపరిచారు. బాల‌ల ఆరోగ్య, సంక్షేమ సూచీలో 2005-06లో సున్నా పాయింట్ నాలుగు వృద్ధిని సాధించిన భార‌త్.. 2015-16 నాటికి సున్నా పాయింట్ ఐదు దగ్గర స్థిరపడింది.

వైసీఓఐ నివేదిక‌లో కేర‌ళ, గోవా రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉండ‌గా అస్సాం, మేఘాల‌య‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, జార్ఖండ్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, బిహార్ చివ‌రి అట్ట‌డుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు వైసీఈఐ నివేదిక‌లోనూ వెన‌క‌బ‌డి ఉండ‌టం గ‌మ‌నార్హం. 2005లో వెన‌కంజ‌లో ఉన్న త్రిపుర ఇప్పుడు మంచి ఫలితాలు చూపించగలిగింది. కాగా దేశంలో ఉన్న 15.9 కోట్ల ఆరేళ్లలోపు చిన్నారుల్లో 21 శాతం మందిలో పోషకాహార లోపం, 36 శాతం మంది తక్కువ బరువుతో ఉండడం, 38 శాతం మందికి టీకాలు అందడం లేదని కూడా నివేదిక తెలుపుతోంది.

Tags :
|
|
|

Advertisement