Advertisement

  • నా లక్ష్యాలు ఎప్పుడు అందనంత ఎత్తులో ఉంటాయి ..మళ్ళీ టీంలోకి వస్తా ..శ్రీశాంత్

నా లక్ష్యాలు ఎప్పుడు అందనంత ఎత్తులో ఉంటాయి ..మళ్ళీ టీంలోకి వస్తా ..శ్రీశాంత్

By: Sankar Sun, 21 June 2020 1:23 PM

నా లక్ష్యాలు ఎప్పుడు అందనంత ఎత్తులో ఉంటాయి ..మళ్ళీ టీంలోకి వస్తా ..శ్రీశాంత్



మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో దాదాపు ఏడు సంవత్సరాలుగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ నిషేధం తొలగిపోవడంతో మళ్ళీ టీంలోకి రిఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు..అయితే ఇప్పటికే 37 సంవత్సరాలు వచ్చిన శ్రీశాంత్ మళ్ళీ ఇండియన్ టీంలోకి అడుగుపెట్టడం కష్టమే అని మాజీలు విశ్లేషిస్తున్నారు ..ఐపీఎల్ 2013 సీజన్‌లో స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌ని అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. దాంతో.. అతనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి జీవితకాల నిషేధం విధించింది. కానీ.. గత ఏడాది శ్రీశాంత్‌పై నిషేధాన్ని సుప్రీంకోర్టు ఏడేళ్లకి కుదించగా.. సెప్టెంబరులో ఆ గడువు ముగియనుంది.

నిషేధం ముగియగానే కేరళ తరఫున రంజీల్లో అతడ్ని ఆడించాలని ఇప్పటికే కేరళ క్రికెట్ అసోషియేషన్ ప్రాథమికంగా నిర్ణయించింది. తొలుత అతని మ్యాచ్ ఫిట్‌నెస్‌ని పరీక్షిస్తామని ఇటీవల చెప్పిన కేరళ టీమ్ కోచ్.. టెస్టులో పాసైతే రెగ్యులర్‌గా అవకాశాలిస్తామని వెల్లడించాడు. రంజీ సీజన్‌లో శ్రీశాంత్ నిలకడగా రాణించగలిగితే.. అతను ఇండియా-ఎ టీమ్‌కి ఆ తర్వాత భారత జట్టుకి ఆడే అవకాశం ఉంది.అయితే ఇప్పుడు ఉన్న ఇంత పోటీలో శ్రీశాంత్ ఏ మాత్రం నెగ్గుకు వస్తాడో చూడాలి ..

అయితే తన రిఎంట్రీ పై ఈ కేరళ ఆటగాడు స్పందిస్తూ 2023 వన్డే ప్రపంచకప్‌ని నేను ఆడగలనని బలంగా విశ్వసిస్తున్నాను. నా లక్ష్యాలు ఎప్పుడూ అందనంత ఎత్తులో ఉంటాయి. వాస్తవానికి ప్రతి అథ్లెట్ టార్గెట్స్‌ కూడా అలానే ఉంటాయి. ఉండాలి కూడా. ఒకవేళ అథ్లెట్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటే సాధారణంగా మారిపోతాడు అని అన్నాడు ..టీం ఇండియా 2007 టి ట్వంటీ ప్రపంచకప్ , 2011 వన్ డే ప్రపంచకప్ గెలిచినా జట్లలో సభ్యుడు అయిన శ్రీశాంత్ తన స్పీడ్ బౌలింగ్ తో టీం ఇండియా విజయాలలో కీలక పాత్ర పోషించాడు ..ముఖ్యంగా 2007 టి ట్వంటీ ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్లో కీలకమైన గిల్ క్రిస్ట్ , హేడెన్ వికెట్లను తీసి టీం ఇండియా విజయంలో ప్రముఖ పాత్ర వహించాడు ..ఇక కీలక ఫైనల్ మ్యాచ్ల్లో పాకిస్థాన్ ఆటగాడు మిస్బా ఉల్ హాక్ కొట్టిన షాట్ ను అంత ఉత్కంఠతో కూడా చక్కగా ఒడిసి పట్టుకొని టీమిండియా మరుపురాని విజయంలో తనవంతు పాత్ర పోషించాడు..అయితే ఫిక్సింగ్ కారణంగా టీంకు దూరమై సుప్రీమ్ కోర్ట్ లో న్యాయపోరాటం చేసి విజయం సాధించాడు ..

Tags :
|
|

Advertisement