Advertisement

  • కేరళలోని ఆ ప్రముఖ ఆలయంలో కరోనా కలకలం ...15 వరకు గుడి మూసివేత

కేరళలోని ఆ ప్రముఖ ఆలయంలో కరోనా కలకలం ...15 వరకు గుడి మూసివేత

By: Sankar Fri, 09 Oct 2020 9:27 PM

కేరళలోని ఆ ప్రముఖ ఆలయంలో కరోనా కలకలం ...15 వరకు గుడి మూసివేత

కేరళలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా ఈరోజు కూడా కేరళలో 9 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గతంలో కేరళలో కేసులు తక్కువగా నమోదయ్యేవి. కానీ, కొన్నిరోజులుగా కేరళలో కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.

ఇక ఇదిలా ఉంటె, అనంతపద్మనాభస్వామి ఆలయంలో కరోనా కలకలం రేగింది. ఆలయంలో ప్రధాన అర్చకుడు పెరియనంబితో పాటుగా, 12 మంది అర్చకులకు కరోనా సోకింది. దీంతో ఆలయాన్ని ఈనెల 15 వ తేదీ వరకు తాత్కాలికంగా క్లోజ్ చేశారు. 15 వరకు భక్తులకు దర్శనం నిలిపివేసినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆలయం దర్శనం నిలిపివేసినప్పటికీ, స్వామివారి సేవలు యధావిధిగా కొనసాగుతాయని ఆలయ అధికారులు చెప్తున్నారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి 21 నుంచి అనంతపద్మనాభస్వామి ఆలయంను మూసివేసిన సంగతి తెలిసిందే. సడలింపుల్లో భాగంగా ఆగష్టు నెలాఖరులో దేవాలయంను తిరిగి తెరిచి భక్తులకు ప్రవేశం కల్పించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆలయంలో కరోనా కేసులు బయటపడటంతో ఆలయాన్ని మరోమారు మూసేశారు.

Tags :
|
|
|

Advertisement