Advertisement

  • కేరళలో మరో విషాదం ..కొండచరియలు విరిగిపడి 26 మంది మృతి

కేరళలో మరో విషాదం ..కొండచరియలు విరిగిపడి 26 మంది మృతి

By: Sankar Sun, 09 Aug 2020 10:51 AM

కేరళలో మరో విషాదం ..కొండచరియలు విరిగిపడి 26 మంది మృతి



కేరళలో విమాన ప్రమాదం జరిగి రెండు రోజులు కూడా కాలేదు అంతలోనే మరొక ప్రమాదం జరిగింది ..కొండచరియలు విరిగి పడటంతో తేయాకు కార్మికులు మరణించారు ..కేరళలోని ఇడుక్కి జిల్లాలో తేయాకు కార్మికుల ఇళ్ళపై కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 27కి చేరింది.

స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఎన్డీఆర్‌ఎఫ్‌కి చెందిన రెండు బృందాలతో కలిసి ఆ ప్రాంతమంతా గాలిస్తున్నారు. రక్షణ చర్యలకు భారీగా కురుస్తోన్న వర్షాలు ఆటంకంగా మారాయి. జిల్లా అధికారుల అంచనా ప్రకారం ఇంకా 46 మంది కనిపించకుండా పోయారు.

ఇన్ని అవాంతరాల మధ్య అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయకార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారని ఇడుక్కి జిల్లా కలెక్టర్‌ హెచ్‌.దినేషన్‌ తెలిపారు. ఇప్పటికే 12 మందిని రక్షించినట్లు చెప్పారు. 55 మంది సిబ్బందితో రక్షణ, పునరావాస కార్యకలాపాలను చేపట్టినట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ దక్షిణాది చీఫ్‌ రేఖా నంబియార్‌ చెప్పారు. గత 24 గంటల్లో సగటున 9.5 సెంటిమీటర్ల వర్షపాతం, అత్యధికంగా కోళీకోడ్‌లోని వడకరలో 32.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


Tags :
|
|
|
|

Advertisement