Advertisement

  • కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు ..కేరళ సీఎం

కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు ..కేరళ సీఎం

By: Sankar Mon, 28 Sept 2020 7:48 PM

కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు ..కేరళ సీఎం


దేశంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదు ..ప్రతిరోజు భారీగానే కరోనా కేసులు నమోదు అయితున్నాయి..అయితే దేశంలో లాక్ డౌన్ మాత్రం సడలింపులు ఇచ్చుకుంటూ వస్తున్నారు..అయితే కరోనా నిబంధనలు, ప్రోటోకాల్‌ను పాటించకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని కేరళ సీఎం పినరయి విజయన్ హెచ్చరించారు.

వివాహ కార్యక్రమాలలో 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మించకూడదని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు మంగళవారం అఖిలపక్ష సమావేశానికి ప్రభుత్వం పిలుపునిచ్చిదని విజయన్ చెప్పారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుందని అన్నారు.

మరోవైపు కేరళలో గత 24 గంటల్లో కొత్తగా 4,538 కరోనా కేసులు నమోదు కాగా 20 మంది మరణించినట్లు సీఎం విజయన్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,78,922కు, మరణాల సంఖ్య 697కు చేరిందని చెప్పారు. ప్రస్తుతం 57,879 యాక్టివ్ కేసులు ఉండగా, రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 12.59 శాతం ఉన్నట్లు విజయన్ వెల్లడించారు.

Tags :
|
|
|
|

Advertisement