Advertisement

  • నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు ఏ ఆనవాళ్లు లేవు ...మాజీ ఎమ్మార్వో కుటుంబీకుల అనుమానం

నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు ఏ ఆనవాళ్లు లేవు ...మాజీ ఎమ్మార్వో కుటుంబీకుల అనుమానం

By: Sankar Wed, 14 Oct 2020 3:26 PM

నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు ఏ ఆనవాళ్లు లేవు ...మాజీ ఎమ్మార్వో కుటుంబీకుల అనుమానం


కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన నాగరాజు చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. అక్కడే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భూవివాదంలో ఎన్‌వోసీ కోసం లంచం డిమాండ్ చేసి...నాగరాజు ఏసీబీ అధికారులచేతికి చిక్కాడు. కోటీ పది లక్షల లంచం కేసులో నాగరాజు నిందితునిగా ఉన్నాడు. నెల రోజుల నుంచీ ఈ కేసు విచారణ జరుగుతోంది. ఏసీబీ అధికారులు ఆయనపై రెండో కేసును కూడా నమోదు చేశారు. దయారా గ్రామంలో 48 ఎకరాల విలువైన భూమికి నకిలీ పత్రాలు సృష్టించి మ్యుటేషన్ చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో ఏసీబీ అధికారులు మాజీ ఎమ్మార్వో తో పాటుగా 9 మందిని నిందితులుగా చేర్చారు. నిన్న నాగరాజును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, సాయంత్రం కస్టడీ ముగిసిన అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు. ఆయన తెల్లవారు జామున కిటికీకి టవల్ తో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేవంటూ నాగరాజు మృతి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు నాగరాజు కుటుంబీకులు. ఉస్మానియా ఆస్పత్రిలో నాగరాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది

Tags :
|

Advertisement