Advertisement

ప్లాస్మా దానం చేసిన కీరవాణి , కాలభైరవ

By: Sankar Tue, 01 Sept 2020 10:34 AM

ప్లాస్మా దానం చేసిన కీరవాణి , కాలభైరవ


కరోనా మహమ్మారి నిర్ములనకు ప్లాస్మా దానం అనేది గొప్పగా పనిచేస్తుంది అని ప్రపంచ వ్యాప్తంగా వదీయులు తెలుపుతున్నారు..తెలంగాణాలో కూడా పోలీసులు , సెలెబ్రిటీలు కూడా ప్లాస్మా దానం మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు..అయితే ఇటీవల కరోనా బారిన పడిన రాజమౌళి , కీరవాణి కుటుంబం కరోనా తగ్గగానే ప్లాస్మా దానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు..

కరోనా మహమ్మారిని జయించి, కరోనాతో పోరాడుతున్న మరింత మందిని తమ ప్లాస్మాతో బ్రతికిస్తున్న ప్లాస్మా దాతలు నిజమైన హీరోలని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి అన్నారు.

కరోనా భారీన పడి విజయం సాధించిన తాను త్వరలోనే వైద్యులను సంప్రదించి ప్లాస్మాను డొనేట్‌ చేస్తానన్నారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి ప్లాస్మా బ్రహ్మాస్త్రంగా పని చేస్తుందని పేర్కొన్నారు కీర‌వాణి. అన్న‌ట్టుగానే ఈ రోజు కీర‌వాణి ఆయ‌న త‌న‌యుడు భైర‌వ ‌కిమ్స్ హాస్పిట‌ల్‌లో ప్లాస్మాను డొనేట్ చేశారు. ర‌క్త‌దానం చేసిన‌ట్టే ఉంది. దీనికి పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు అని కీర‌వాణి త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement