Advertisement

  • రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్‌ వచ్చినా తట్టుకొంటామన్న కెసిఆర్

రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్‌ వచ్చినా తట్టుకొంటామన్న కెసిఆర్

By: chandrasekar Mon, 23 Nov 2020 11:47 AM

రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్‌ వచ్చినా తట్టుకొంటామన్న కెసిఆర్


ప్రస్తుతం దేశంలో మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్‌ వచ్చినా తట్టుకొంటామని కెసిఆర్ ప్రకటించారు. దేశ రాజధానితోపాటు, కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌-19 కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కేసులు పెరుగకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్‌ వచ్చినా తట్టుకొంటామని.. ఇందుకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని వ్యక్తిగత అప్రమత్తతే కరోనాకు అసలైన మందు అని పేర్కొన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కొవిడ్‌ కేసుల సంఖ్య బాగా తగ్గింది. పెద్దఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 2.1శాతం మాత్రమే. రికవరీ రేటు 94.5 శాతానికి చేరింది. వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నదని తెలిపారు.

కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా పదివేల బెడ్స్‌ ఆక్సిజన్‌ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఎన్నయినా సిద్ధం చేయగలం. ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉన్నది అని స్పష్టం చేశారు. కొవిడ్‌ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చేయాల్సినంత ప్రయత్నం చేస్తున్నది. దీనికి ప్రజల సహకారం కూడా అవసరం. అన్‌లాక్‌ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండటమే అసలైన మందు. తప్పకుండా మాస్క్‌ ధరించాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి అని సీఎం సూచించారు. మనకు కొవిడ్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక ముందుగా ఆరోగ్య సిబ్బందికే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ముర్తజా రిజ్వీ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు, మెడికల్‌ హెల్త్‌డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి, కొవిడ్‌ నిపుణుల కమిటీ సభ్యుడు గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రజల తగిన జాగ్రత్తల వల్లే ఇది సాధ్యమవుతుంది.

Tags :
|
|

Advertisement