Advertisement

  • పీవీ నరసింహారావు తెలంగాణ వాడు కావడం మనందరికీ గర్వ కారణం ..శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతాం ..కెసిఆర్

పీవీ నరసింహారావు తెలంగాణ వాడు కావడం మనందరికీ గర్వ కారణం ..శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతాం ..కెసిఆర్

By: Sankar Wed, 17 June 2020 9:57 PM

పీవీ నరసింహారావు తెలంగాణ వాడు కావడం మనందరికీ గర్వ కారణం ..శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతాం ..కెసిఆర్



మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పీవీ పుట్టిన రోజైన జూన్ 28 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. దేశ ప్రధాన మంత్రిగా, స్వతంత్ర సమరయోధుడిగా, విద్యావేత్తగా, సాహితీవేత్తగా పీవీ నరసింహారావు అనేక విధాలుగా సేవలు అందించారని కీర్తించారు. అంత గొప్ప వ్యక్తి తెలంగాణ వాడు కావడం రాష్ట్ర ప్రలజందరికీ గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.

ఆయన సేవలను ఘనంగా స్మరించుకోవడానికి శత జయంతి వేడుకలను గొప్పగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. పీవీ మన ఠీవీ అని గొప్పగా చెప్పుకునే విధంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. కాగా, పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణకు కే. కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

ఈ కమిటీలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, కుమార్తె వాణీ దేవీ, కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్, భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, అంపశయ్య నవీన్, మరికొందరు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

Tags :
|

Advertisement