Advertisement

  • దేశ గతిని మార్చిన గొప్ప నాయకుడు పివి నరసింహారావు ..కెసిఆర్

దేశ గతిని మార్చిన గొప్ప నాయకుడు పివి నరసింహారావు ..కెసిఆర్

By: Sankar Wed, 24 June 2020 12:17 PM

దేశ గతిని మార్చిన గొప్ప నాయకుడు పివి నరసింహారావు ..కెసిఆర్



పివి నరసింహారావు ..భారత దేశానికి ప్రధానిగా చేసిన తెలుగు వాడు ..దేశం అత్యంత కష్టాల్లో ఉన్న దశలో ప్రధానమంత్రిగా బాధ్యతలు అందుకున్న పివి ..తన సంస్కరణలతో ఇండియాను అభివృద్ధి పధంలో నడిపించుటకు బాటలు వేసాడు ..అప్పటిదాకా ప్రైవేట్ కంపెనీలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ , దేశాల అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రపంచ దేశాలతో పాటు మనం కూడా పోవాలని భావించి యల్పిజి విధానాన్ని ప్రవేశ పెట్టాడు ..అప్పటి ఆర్ధిక మంత్రి అయిన మన్మోహన్ సింగ్తో కలిసి అనేక ఆర్ధిక సంస్కరణలను తీసుకొచ్చి ఇండియాలో పెట్టుబడులకు అనుకూలం అని చాటి చెప్పాడు ..

అయితే తెలంగాణ సీఎం కెసిఆర్ మాట్లాడుతు ఇంతటి గొప్ప నాయకుడు, దేశ గతిని మార్చినవారు భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు నేనే స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొ న్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలచుకునేలా, చిరస్మరణీయంగా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాదంతా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

పీవీ జన్మదినమైన జూన్‌ 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞాన భూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరిమితంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటానని, అదే రోజు దాదాపు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తామని, మంత్రి కేటీఆర్‌ ఈ కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షిస్తారని సీఎం వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్ల కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలను బట్టి, నిధులు విడుదల చేసుకుంటూ పోతామన్నారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.


Tags :
|

Advertisement