Advertisement

  • పది రోజుల్లో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయాలి ..కెసిఆర్ ఆదేశం

పది రోజుల్లో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయాలి ..కెసిఆర్ ఆదేశం

By: Sankar Tue, 16 June 2020 08:04 AM

పది రోజుల్లో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయాలి ..కెసిఆర్ ఆదేశం


రైతుల నుంచి తమకు వందకు వంద శాతం మద్దతు లభించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే పంటలు వేసుకోవడానికి సిద్ధం కావడం హర్షణీయమని సీఎం అన్నారు. రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున వెంటనే వారికి రైతుబంధు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని.. రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు.

వారం పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. యాసంగిలో ఏ పంటలు వేయాలో రైతులకు నిర్దేశం చేయాలి.. విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్‌ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రతిపాదించిందని సీఎం వివరించారు.

రైతుబంధు డబ్బులు ఉపయోగించుకుని వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ వర్షాకాలంలో నియంత్రిత పంటల సాగు విధానానికి విజయవంతంగా తొలి అడుగు పడిందని.. వర్షాకాలం పంటల కోసం ప్రణాళిక రూపొందించినట్లుగానే యాసంగి పంటల కోసం కూడా వ్యవసాయ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags :
|
|

Advertisement